ఫ్యూచర్ రిలయన్స్ డీల్‌పై తుది ఆదేశాలివ్వొద్దు
ఎన్‌సిఎల్‌టికి సుప్రీం కోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ : ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) విలీనంపై తుది ఆదేశాలను ఇవ్వొద్దని ఎన్‌సిఎల్‌టిని సోమవారం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇరు సంస్థల ఒప్పందంపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా అమెజాన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. రిలయన్స్‌ఫ్యూచర్ ఒప్పందానికి మార్గం సుగమం చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై అమెరికాకు చెందిన ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
విచారణలో ఎన్‌సిఎల్‌టి (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఆదేశాలను ఆపాలని సుప్రీం పేర్కొంది. రిలయన్స్‌తో రూ.24,713 కోట్ల విలువచేసే ఒప్పందానికి సంబంధించి ఆమోదం కోసం ఫ్యూచర్ గ్రూప్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఫ్యూచర్ గ్రూప్ తరఫు న్యాయవాది హరీష్ సాల్వే మాట్లాడుతూ, గత ఆరు వారాలుగా ఎన్‌సిఎల్‌టి నిలిపివేసిన ఆదేశాలను పొడిగిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. ఎన్‌సిఎల్‌టి ఆదేశాలు కొనసాగుతాయని, అయితే విలీనంపై తుది ఆదేశాలు నిలిపివేయాలని బెంచ్ సూచించింది.