Home తాజా వార్తలు నుస్లీ వాడియా, రతన్ టాటా మధ్య సయోధ్య

నుస్లీ వాడియా, రతన్ టాటా మధ్య సయోధ్య

Tata-Wadia

 

పరువు నష్టం కేసులను ఉపసంహరించుకున్న నుస్లివాడియా

ముంబై: టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా, ఇతరులపై రూ.3,000 కోట్ల పరిహారం సహా పలు పరువు నష్టం కేసులను సుప్రీంకోర్టు నుంచి బాంబే డైయింగ్ చైర్మన్ నుస్లీ వాడియా ఉపసంహరించుకున్నారు. ఇంతకుముందు సుప్రీంకోర్టు నుస్లీ వాడియా, రతన్ టాటాలు కలిసి కూర్చుని పరువు నష్టం కేసులో తమ విభేదాలను పరిష్కరించుకోవాలని కోరింది. కొన్ని టాటా గ్రూప్ కంపెనీల బోర్డు డైరెక్టర్ల నుంచి తొలగించిన తరువాత నుస్లీ వాడియా 2016లో రతన్ టాటా, టాటా సన్స్ ఇతర డైరెక్టర్లపై క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.

2020 జనవరి 6న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే ధర్మాసనం ‘మీరు ఇద్దరూ పరిణతి చెందినవారు, పరిశ్రమ నాయకులు. మీరు ఈ విషయాన్ని ఎందుకు పరిష్కరించుకోలేరు. మీరు కలిసి కూర్చుని విభేదాలను ఎందుకు పరిష్కరించకూడదు’ అని పేర్కొంది. దీని తరువాత కేసు విచారణ జనవరి 13కి వాయిదా పడింది. బాంబే హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ ధర్మాసనం మొదట్లో కేసును పరిష్కరించాలని కోరింది. దీనిలో పరువు నష్టం ఉద్దేశం లేదని హైకోర్టు పేర్కొంది. అయితే ఈ కేసులో తనకు ప్రత్యేక అభ్యర్ధన ఉందని వాడియా న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం జనవరి 13కి వాయిదా వేసింది. టాటా గ్రూపునకు వ్యతిరేకం కాదని, బోర్డు డైరెక్టర్ల నుంచి తొలగించడం వల్ల కలిగే పరువు నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ వాదనలు చేస్తున్నామని చెప్పారు.

SC Suggests Reconciliation In The Tata-Wadia Defamation