Saturday, April 20, 2024

అగ్నిపథ్‌పై పిటిషన్లు ఇక ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం

- Advertisement -
- Advertisement -

SC transferred petitions against Agnipath to Delhi High Court

న్యూఢిల్లీ : సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. కేరళ, పంజాబ్, హర్యానా, బీహార్ , ఉత్తరాఖండ్, హైకోర్టుల్లోనూ దాఖలైన పెండింగ్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. ఆ పిటిషన్లు వేసిన వారు ఢిల్లీ కోర్టు లోనూ వాదనలు వినిపించవచ్చని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృతం లోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పెండింగ్ కేసులు బదిలీ చేయకున్నా లేదా పిటిషనర్లు అభ్యంతరం తెలిపినా, ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు విచారణ ఆపాలని ఆయా కోర్టులకు సూచించింది. అగ్నిపథ్‌పై ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న కేసులు సహా తాము బదిలీ చేసిన పిటిషన్లను కూడా పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టుకు సుప్రీం తెలియజేసింది. గత నెల 14న ఈ కొత్త పథకాన్ని కేంద్రం తీసుకురాగా వ్యతిరేకిస్తూ తెలంగాణ సహా బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు చెలరేగిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News