‘నీట్’ ప్రవేశాల్లో ఓబీసీ కోటా రాజ్యాంగబద్ధమే: సుప్రీం
సాంఘిక, ఆర్థిక నేపథ్యంలో మెరిట్‌ను కలగలిపి చూడాలి వెనుకబాటు తనాన్ని
సరిదిద్దడంలో రిజర్వేషన్ల పాత్రను నిస్సారం చేయొద్దు ఓబీసీలకు 27%, ఈడబ్లూఎస్
వర్గాలకు 10% రిజర్వేషన్లు, రూ.8లక్షల క్రీమిలేయర్ ఆధారంగా అమలు
ఈనెల 7నాటి తీర్పును సమర్థిస్తూ తాజాగా సుదీర్ఘ ఉత్తర్వు
న్యూఢిల్లీ: నీట్ ప్రవేశాల్లో ఒబిసి రిజర్వేషన్లు చట్టబద్ధమేనని సుప్రీంకోర్టుతేల్చి చెప్పింది. మెరిట్‌కు రిజర్వేషన్లు అడ్డంకి కాబోవని కూడా స్పష్టం చేసింది. నీట్ పరీక్షల్లో ఒబిసి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల( ఇడబ్లుఎస్) రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఒబిసిలకు 27 శాతం, ఇడబ్లుఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను రూ.8 లక్షల క్రీమీలేయర్ ఆధారంగా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఈ నెల 7న తీర్పు వెలువరించింది. అయితే ఈ అంశంపై గురువారం సుప్రీంకోర్టు సుదీర్ఘంగా తీర్పు వెలువరించింది. భారీ స్కోరు ప్రతిభకు ఏకైక కొలమానం కాదని బెంచ్ స్పష్టం చేసింది. నీట్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్పులకు ప్రవేశాల్లో ఇతర వెనుకబడిన తరగతులకు(ఒబిసి) రిజర్వేషన్లను అనుమతిస్తూ జనవరి 7న ఇచ్చిన తీర్పును సమర్థించింది.సాంఘిక, ఆర్థిక నేపథ్యంతో ప్రతిభను కలగలిపి చూడాలని తెలిపింది. వెనుకబాటుతనాన్ని సరిదిద్దడంలో రిజర్వేషన్ల పాత్రను నిస్సారం చేయకూడదని పేర్కొంది.
ప్రతిభ, రిజర్వేషన్లు పరస్పర సంఘర్షణ కలవి కాదని తెలిపింది. సాంఘిక న్యాయం తాలూకు సమ పంపక పర్యవసానాలను రిజర్వేషన్లు మరింత ముందుకు తీసుకెళ్తాయని పేర్కొంది. ఆర్థికంగా బలహీన వర్గాల( ఇడబ్లుస్)కు చెందిన వారికి నీట్‌పిజి ప్రవేశాల విధానంపై నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం (రూ.8 లక్షల స్థూల వార్షికాదాయం) ప్రస్తుత విద్యాసంవత్సరానికి వర్తిస్తుందని తెలిపింది.ఈ దశలో ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ఈ సంవత్సరంలో ప్రవేశాలు ఆలస్యమవుతాయని పేర్కొంది.2021 22బ్యాచ్‌కి రిజర్వేషన్ల విధానంపై నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. మనం ఇంకా కొవిడ్19 మహమ్మారి మధ్యలోనే ఉన్నామని పేర్కొంది. వైద్యుల నియామకం లో ఆలస్యమైతే దాని ప్రభావం మహమ్మారిపై స్పందనపై పడుతుందని తెలిపింది. సమానత్వాలు ఉండాల ని రాజ్యాంగంలోని అధికరణలు 15(4), 15(5)చెబుతున్నట్లు తెలిపింది. వ్యక్తుల సమర్థత, సామర్థాలు, ప్రతిభను పోటీ పరీక్షలు ప్రతిబింబించబోవని స్పష్టం చేసింది. కొన్ని వర్గాలకు లభించే సాంఘిక, ఆర్థిక, పో టీ పరీక్షలు ప్రతిబింబించబోవని కూడా స్పష్టం చేసింది.
Supreme court upholds validity of OBC quota in NEET