Saturday, April 20, 2024

క్షమాభిక్షపై నిర్భయ దోషి పిటిషన్ కొట్టివేత

- Advertisement -
- Advertisement -

SC

 

ఢిల్లీ: ముఖేష్ కుమార్ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్  తిరస్కరించడాన్ని అతడు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. నిర్భయ నిందితుడు ముఖేష్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ భానుమతి ధర్మాసనం కొట్టేసింది. ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు నిర్భయం దోషులకు ఉరిశిక్ష అమలుకానుంది. గతంలో విచారణ సందర్భంగా… దోషి ముఖేష్ ఒక్కడినే ఒక సెల్‌లో దీర్ఘకాలం ఉంచలేదని, కొన్ని రోజుల పాటు మాత్రమే వేరే సెల్‌లో పెట్టారని చెప్పారు. దోషికి సంబంధించిన అన్ని పత్రాలు క్షమాభిక్ష కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రపతికి పంపినట్టు తెలిపారు. ఇటువంటి కేసుల్లో ధర్మాసనానికి జ్యుడిషియల్ రివ్యూకు సంబంధించిన అధికారం పరిమితంగా ఉంటుందని, అందువల్ల క్షమాభిక్ష నిర్ణయంలో ఆలస్యం అమానుషత్వ ప్రభావానికి దారి తీస్తుందని చెప్పారు. రాష్ట్రపతి ప్రతి విధానాన్ని పరిశీలించారని, తనకు తాను సంతృప్తి చెందిన తరువాతనే క్షమాభిక్ష గురించి ఆలోచిస్తారని అన్నారు. ఈ సందర్భంగా పిటిషన్‌దారుడ్ని ఉద్దేశించి ధర్మాసనం రాష్ట్రపతి ఏమీ ఆలోచించకుండా అభ్యర్థనను తిరస్కరించారని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు. దోషి తరఫున సీనియర్ న్యాయవాది అంజనా ప్రకాష్ తన వాదన వినిపిస్తూ ముఖేష్‌ను జైలులో లైంగికంగా వేధించారని, కొట్టారని ఆరోపించారు. దోషికి సంబంధించిన అన్ని పత్రాలు రాష్ట్రపతికి సమర్పించ లేదని వాదించారు. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణలో విధానాల లోపం కనిపిస్తోందన్నారు.

 

SC verdict on convict’s plea mercy plea rejection
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News