Home తాజా వార్తలు డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో మోసం…

డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో మోసం…

 Double Bedroom Houses

 

యాదాద్రిభువనగిరి : ఇండ్లు లేని నిరుపేదలును మోసం చేయడానికి డబల్ బెడ్రూం ఇండ్లను ఆసరాగా చూపించి 8 కోట్ల 1 లక్ష రూపాయలు 27 వందల మంది వద్ద కాజేసిన ముఠాను శనివారం రోజున యాదాద్రిభువనగిరి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. యాదాద్రి భువనగిరి డిసిపి నారాయణ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఇండ్లులేని నిరుపేదల అవసరాలను ఆసరాగా తీసుకొని అక్రమాలకు పాల్పడుతున్న ఆరుగురు మాల్యావికరుణ సొసైటీ నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.

మాల్యావికరుణ సొసైటీకి సంబందించిన వారు జిల్లాలోని ఇల్లులేని వారి నుండి మొదట 30వేలు చెల్లిస్తే ఇల్లు నిర్మించి ఇస్తామని నమ్మించి 8 కోట్ల రూపాయలు వసూలు చేసిన నిర్వాహకులు కొండ కృష్ణమ్మ(30)మేనెజింగ్ డైరెక్టర్ నివాసం ఖమ్మం , కొండ రమేష్(31)జనరల్ సెక్రెటరీ నివాసం ఖమ్మం , కొండ వెంకట నారాయణ(37) కూసుమంచి ఖమ్మం , కట్ట మహేంద్రనాథ్(25) భైరామల్ గూడా కార్మన్ ఘాట్ సరూర్ నగర్, కొత్త రాజిరెడ్డి, జాజర్ల సాయి చరణ్‌లు ఒక సంస్థను ఏర్పాటు చేసి గ్రామంలోని ఇల్లులేని పేద ప్రజల వద్దా 27వందల మంది నుండి 30వేల రూపాయల చొప్పున వసూలు చేసి వారు చెల్లించిన 45 రోజుల లోపు ఎన్నారై సంస్థతోటి పూర్తి మెటిరీయల్‌తో సహా ఇల్లు నిర్మించి ఇస్తామని తరువాత మీరు ఎలాంటి రూపాయలు చెల్లించవలిసిన అవసరం లేదని ప్రజలకు నమ్మబలికి దాదాపు 5 నెలలు గడవడంతో బాదితులకు ఇండ్లు నిర్మించకపోవడంతో ఆలేరులో రమాదేవి అనే మహిళా ఎస్‌ఓటి పోలీసులకు సమాచారం ఇవ్వగా కదిలిన పోలీస్ యంత్రాంగం మల్యావికరణ సొసైటీ నిర్వాహకులను విచారించడంతో అసలు నిజాలు బయటకు రావడం జరిగింది.

వీరిని కర్మన్ ఘాట్ మాల్యావికరుణోదయ సొసైటీ కార్యాలయంలో ఎస్‌ఓటి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగించారు. వీరిలో కొత్త రాజిరెడ్డి(35) కొలనుపాక గ్రామం, ఆలేరు మండలం, మరియు జాజర్ల సాయి చరణ్ (25) చైతన్యనగర్ జడ్చెర్ల వీరు పరారీలో ఉన్నట్లు డిసిపి నారాయణరెడ్డి తెలిపారు. వీరిపై గతంలో పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. వీరి వద్ద నుండి 12లక్షల 22వేల నగదుతో పాటు ఒక ల్యాప్ ట్యాప్, పలు రశీదులను పోలీసులు స్వాదీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. బాదితులు ఎవరైనా ఉంటే అధైర్య పడకుండా పిర్యాదు చేసి కోర్టు ద్వారా తమ సొమ్ము పొందాలని సూచించారు.

Scams with Double Bedroom Houses