Home తాజా వార్తలు ఫోర్బ్స్‌లో మన ముద్దుగుమ్మలకు దక్కని చోటు…

ఫోర్బ్స్‌లో మన ముద్దుగుమ్మలకు దక్కని చోటు…

 

ముంబయి: ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న తారలలో ఈసారి ఒక్క బాలీవుడ్ భామకు కూడా చోటు దక్కలేదు. తాజాగా, 2019 ఏడాదికి గానూ ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న నటీమణుల జాబితాను ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో హాలీవుడ్‌ బ్యూటీ స్కార్లెట్‌ జోహన్సన్ దాదాపు రూ.400 కోట్లు (56 మిలియన్‌ డాలర్లు) ఆర్జించి అగ్ర స్థానంలో నిలిచింది. 2018 ఫోర్బ్స్‌ జాబితాలోనూ అత్యధికంగా ఆర్జిస్తున్న నటిగా ఈ బ్యూటే అగ్రస్థానంలో ఉండటం విశేషం. ఇక, రూ.315 కోట్లు (44.1 మిలియన్‌ డాలర్లు) ఆర్జించి సోఫియా వర్గరా రెండో స్థానంలో నిలువగా.. దాదాపు రూ.250 కోట్లతో (35 మిలియన్‌ డాలర్లు), రూ.245 కోట్లు (34 మిలియన్‌ డాలర్లు), రూ.200 కోట్లు (28 మిలియన్‌ డాలర్లు) ఆర్జించి రీస్ విథర్‌స్పూన్‌టో, నికోల్‌ కిడ్మాన్‌, జెన్సీఫర్‌ అనిస్టన్‌ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలు సొంతం చేసుకున్నారు.

కాగా, ఈ జాబితాలో ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణెలు కూడా ఈసారి ఫోర్బ్స్‌లో చోటు దక్కించుకోలేకపోయారు. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ మధ్య  కాలంలో ప్రపంచంలో అత్యధికంగా ఆర్జించిన నటుల జాబితాను ఇటీవల ప్రకటించారు. ఇందులో బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ రూ.466 కోట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు భారత్‌ నుంచి ఈ జాబితాలో చోటుదక్కించుకున్న ఒకే ఒక్క బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. ఈ జాబితాలో రాక్‌గా ప్రసిద్ధి పొందిన హాలీవుడ్ నటుడు వేన్ జాన్సన్ రూ. 640 కోట్ల సంపాదనతో ప్రథమ స్థానంలో నిలిచాడు.

Scarlett Johansson highest paid actress on forbes list