Home తాజా వార్తలు ఉద్యోగాల కల్పనలో సింగరేణి టాప్

ఉద్యోగాల కల్పనలో సింగరేణి టాప్

SCCL

ఐదేళ్లలో 10,446 మందికి ఉద్యోగాలు
మన తెలంగాణ/హైదరాబాద్: గత ఐదేళ్లలో సింగరేణి సంస్థలో 10,446 కొత్త ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అద్భుత రీతిలో పురోగమిస్తున్న సింగరేణి కొత్త ఉద్యోగాల్లో కూడా తనదైన ముద్రను కనబరిచింది. 10,446 మొత్తం ఉద్యోగాలు ఇవ్వగా, ఇందులో ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా 3,025 మందికి కొత్త ఉద్యోగాలు ఇచ్చారు. మరో 7,421 మందికి డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ కింద అవకాశం కల్పించింది. నీళ్లు, నిధులు, నియామకాలే లక్షంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీలో సింగరేణి కూడా తనవంతు ఉద్యోగ ఖాళీలు భర్తీచేసి, పోరాట ఫలితాలు అందించింది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం ఫలితంగానే మూడు దశాబ్ధాలకు పైగా కొత్త ఉద్యోగ నియామకాలు లేని దుస్థితికి చరమగీతం పాడారు. ఈ ఐదేళ్లలో సింగరేణిలోని ఖాళీలను గుర్తించి, నియామకం చేశారు. మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, పర్సనల్, అక్కౌంట్స్, తదితర విభాగాలలో పెద్ద ఎత్తున అధికారులు, కార్మికుల నియామకం జరిగింది. ఇంటర్ఫూలు ఎత్తేసి, కేవలం రాతపరీక్ష ద్వారానే నియామక ప్రక్రియ జరిపారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన ఎన్‌సిడబ్లు ఉద్యోగుల్లో క్లర్కులు, ఎలక్ట్రిషన్లు, ఫిట్టర్లు, వెల్డర్లు, సర్వేయర్లు, ఇతర టెక్నీషియన్లు ఉన్నారు.

అధికారుల విభాగంలో మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీర్లు, సివిల్, ఫైనాన్స్, అక్కౌంట్స్, పర్సనల్, ఫారెస్టు అధికారులు, సెక్యూరిటీ అధికారులు, స్పెషలిస్టు డాక్టర్లు తదితరులు ఉన్నారు. దీనికి తోడు ఏళ్ల తరబడి నిరీక్షణకు ముగింపు పలుకుతూ డిపెండెంట్లకు ఉద్యోగ అవకాశాలు యాజమాన్యం కల్పించింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు 7,421 మందికి డిపెండెంట్ ఉద్యోగ యోగం కలిగింది. దీనికి తోడు కారుణ్య నియామకాల ద్వారా ఇప్పటికే 3041 మందికి ఉద్యోగాలు లభించింది. కొత్త ఉద్యోగాల కల్పనతో సింగరేణిలో యువరక్తం చేరింది. డిపెండెంట్లకు ఉద్యోగం, డైరెక్టు రిక్రూట్‌మెంట్, కారుణ్య నియామకాలు, ఇతరత్రా నియామకాలతో యువకుల చేరి, వృద్ధిరేటును పెరిగే అవకాశం ఉంది.

SCCL hired 10446 persons in 5 years in Telangana