Saturday, April 20, 2024

అగని ప్రైవేటు బడుల పాత బకాయిల వేట…

- Advertisement -
- Advertisement -

గత ఏడాదితో పాటు ఈసంవత్సరం ఫీజుల చెల్లించాలని వేధింపులు
లేదంటే విద్యార్థులను పై తరగతులకు అనుమతిలేదు
ఫీజుల భారంతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
యాజమాన్యాల బెదిరింపులో చదువులకు చిన్నారులు దూరం

School management force parents for fees
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో విద్యాసంస్దలు ప్రారంభమై పక్షం రోజుల గడిచిన ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు పాత బకాయిలు చెల్లించాలని విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారు. ఫీజులు పేరుతో విద్యార్థులను వేధించి కోట్ల రూపాయల సంపాదించుకునేందుకు అడ్డదారులు పయానిస్తున్నారు. గతేడాదికి సంబంధించిన బకాయిలతో పాటు, ఈ సంవత్సరంకు చెందిన ట్యూషన్ పూర్తిగా చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు. చెల్లించకుంటే పై తరగతులకు అనుమతి ఇవ్వమని బెదిరింపులకు గురిచేస్తున్నారు.

నగరంలో పేరుమోసిన కొన్ని బడులు ఒక్కొక్క విద్యార్దిని పాత బకాయి రూ. 1.40 లక్షలు చెల్లిస్తేనే స్కూల్‌కు రావాలని హెచ్చరిస్తున్నారు. పిల్లలను ఇంటివద్ద ఉంచలేక, ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. గడచిన ఏడాదిలో 60శాతం ఫీజులు చెల్లించాలని విద్యాశాఖ ఆదేశించిన స్కూళ్ల యాజమాన్యాలు మాత్రం తమ సిబ్బందికి పూర్తి స్దాయిలో వేతనాలు చెల్లించామని, మీరు కూడా ఫీజులు పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. విద్యాశాఖ అధికారులు ప్రైవేటు బడులపై చర్యలు తీసుకుంటామనే మాటలు ప్రకటనలకే పరిమితమైయ్యారని ఎక్కడ తనిఖీలు చేయడం, చర్యలు తీసుకోవడం వంటి చేయకుండా యాజమాన్యాలు ఇచ్చే లంచాలకు కక్కుర్తి పడి విద్యార్దుల జీవితాలను అంధకారంలో పడేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయి, ఆర్దికంగా ఇబ్బందులు పడుతుంటే పాఠశాలల ఫీజులు కంటికి నిద్ర లేకుండా చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ జిల్లాలో 1845 ప్రైవేటు పాఠశాలుండగా వాటిలో 7.10లక్షల మంది విద్యార్దులు ఉన్నారు. ఇకా దిల్‌షుక్‌నగర్, హయత్‌నగర్, బోడుప్పల్, శంషాబాద్, బిఎన్‌రెడ్డి, అమీర్‌పేట, తార్నాక, ఉప్పల్, రాజేంద్రనగర్ ఏరియాలో పేరు మోసిన కొన్ని స్కూల్‌పై ఫీజుల వసూలపై ఫిర్యాదులు వచ్చినట్లు విద్యాశాఖ కిందిస్దాయి వెల్లడిస్తున్నారు. విద్యార్ది సంఘాల నాయకులు విద్యార్దుల నుంచి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేసి మళ్లీ థర్డ్‌వేవ్ పేరుతో స్కూల్ మూసే కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నెల రోజుల పాటు కోవిడ్ నిబంధనలు పాటించకుండా తరగలు నిర్వహించి తరువాత విద్యార్దులు దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో అస్వస్దతకు గురైతున్నారని గగ్గోలు పెట్టి, చివరకు మళ్లీ మూతవేసి, జేబులు నింపుకుంటారని బిసి విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News