Home తాజా వార్తలు ఆరో తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్..

ఆరో తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్..

School teacher severely beats 6th class child

 

మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి : ఓ పైవేటు స్కూల్ టీచర్ పైశాచికం ప్రదర్శించింది. స్టడీ అవర్‌లో పిల్లాడు అల్లరి చేశాడనే నెపంతో ఇష్టం వచ్చినట్లుగా చితకబాదారు.. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని మాంటేశ్వారి స్కూల్ లో ఆరో తరగతి తరగతి విద్యార్ధి ఏ.సుమన్ ను అదే పాఠశాలలో పదోతరగతి విధ్యార్థులకు పాఠాలు చెప్పే ఓ ఉపాధ్యాయుడు చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న సుమన్ తల్లి తండ్రులు పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపల్‌ని నిలదీశారు. అయితే అక్కడ విద్యార్థి సుమన్ పై దాడి చేసిన ఉపాధ్యాయుడు అక్కడి నుంచి పరారయ్యారు.

అల్లరి చెయ్యడం వల్లే కొట్టినట్లు ప్రిన్సిపల్ తెలపడంతో తల్లి తండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాతలు తేలేలా కొట్టడం ఏమిటని ప్రశ్నించారు.దీనిపై సరైన సమాధానం రాకపోవడంతో తల్లి కుమారుడితో కలసి అక్కడే బైఠాయించింది. తమ కుమారుడిని కొట్టిన టీచర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కొన్ని ప్రైవేటు పాఠశాలలు, విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి నిబంధనలు పాటించడం లేదని. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం ఆందోళన కలిగించే విషయని జిల్లా కేంద్రంలో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

School teacher severely beats 6th class child