Sunday, June 22, 2025

పాఠశాలలకు 230 రోజులు పనిదినాలు…

- Advertisement -
- Advertisement -

12 నుంచి పాఠశాలలు ప్రారంభం
సెప్టెంబర్ 21 నుంచి
అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు
2026 జనవరి 11 నుంచి 15 వరకు
సంక్రాంతి సెలవులు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 లోపు
టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు
మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు
2026 ఏప్రిల్ 23 చివరి పనిదినం
2025 26 అకడమిక్ క్యాలెండర్ విడుదల

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పాఠశాలలు ఈ విద్యా సంవత్సరంలో 230 రోజులు పని చేయనున్నాయి. వేసవి సెలవులు అనంతరం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ 2025 – 26 విద్యాసంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. ఉన్నత పాఠశాలలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు తరగతులు నిర్వహించనుండగా(జంటనగరాలలో ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 వరకు), అప్పర్ ప్రైమరీకి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 వరకు తరగతులు నిర్వహించాలని అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు.

అలాగే ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు(జంటనగరాలలో ఉదయం 8.45 నుంచి మధ్యాహ్నం 3.45 వరకు) కొనసాగనున్నాయి. 2026 ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. 2026 ఏప్రిల్ 24 నుంచి 11 జూన్ వరకు వేసవి సెలవులుగా నిర్ణయించారు. మార్చిలో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఉంటాయని తెలిపిన పాఠశాల విద్యాశాఖ ఫిబ్రవరి 28లోపు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఫార్మెటివ్ అసెస్‌మెంట్(ఎఫ్‌ఎ) -1 పరీక్షలు జులై 31 వరకు నిర్వహించనుండగా..ఎఫ్‌ఎ -2 పరీక్షలు సెప్టెంబర్ 30 వరకు నిర్వహించనున్నారు.

సమ్మెటివ్ అసెస్‌మెంట్(ఎస్‌ఎ) -1 పరీక్షలు అక్టోబర్ 24 నుంచి 31 వరకు,ఎఫ్‌ఎ -డిసెంబర్ 23 వరకు, ఎఫ్‌ఎ 4 2026 ఫిబ్రవరి 7 వరకు, ఎస్‌ఎ 2 పరీక్షలు 2026 ఏప్రిల్ 10 నుంచి 18 వరకు నిర్వహిస్తారు. 21 సెప్టెంబర్ 2026 నుంచి అక్టోబర్ 3 వరకు 13 రోజులు దసరా సెలవులుగా నిర్ణయించారు. 23 డిసెంబర్ నుంచి 27 డిసెంబర్ 2026 వరకు క్రిస్మస్, 2026 జనవరి 11 నుంచి 15 వరకు 5 రోజులు సంక్రాంతి సెలవులు ఉంటాయి. 2026 ఏప్రిల్ 23 చివరి పనిదినంగా నిర్ణయించారు. అన్ని పనిదినాలలో డిజిటల్ క్లాసులు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

2025 26 విద్యాసంవత్సరం క్యాలెండర్ వివరాలు

సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు
డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఐదు రోజులపాటు క్రిస్మస్ సెలవులు
వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు
2026 ఫిబ్రవరి 28 లోపు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు
2026 మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు
2026 ఏప్రిల్ 23 చివరి పనిదినం

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 వరకు ఉన్నత పాఠశాలల సమయం
అప్పర్ ప్రైమరీకి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 వరకు తరగతులు
ప్రైమరీ పాఠశాలలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు తరగతులు
ఎఫ్‌ఎ -1 పరీక్షలు జులై 31 వరకు, ఎఫ్‌ఎ 2 సెప్టెంబర్ 30 వరకు
ఎస్‌ఎ 1 పరీక్షలు అక్టోబర్ 24 నుంచి 31 వరకు
ఎఫ్‌ఎ 3 పరీక్షలు డిసెంబర్ 23 వరకు, ఎఫ్‌ఎ 4 2026 ఫిబ్రవరి 7 వరకు
ఎస్‌ఎ 2 పరీక్షలు 2026 ఏప్రిల్ 4 నుంచి 18 వరకు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News