Tuesday, April 23, 2024

విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ఎపి ప్రభుత్వం..

- Advertisement -
- Advertisement -

Jagan rt

 

అమరావతి: కరోనా వైరస్ నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు అధికారులతో నిర్వహించిన సమావేశంలో విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని నివారించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని సిఎం జగన్ అధికారులనుఆదేశించారు. ఈ క్రమంలో ప్రజలను ఆందోళనకు గురిచేయవద్దని సూచించారు. గురువారం నుంచి ఎపిలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లకు సెలవులు ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం మేరకు ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాల మేరకు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీలు, కోచింగ్ సంస్థలు మూసివేయనున్నారు. అలాగే ఎపిపిఎస్‌సి నిర్వహించే పలు పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈనెల 21, 22, 27, 28, 29 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను ఏప్రిల్, మేలో నిర్వహించేలా కొత్త షెడ్యూళ్లను ప్రకటించింది.

Schools Closed in AP till March 31 due to Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News