Home ఎడిటోరియల్ కశ్మీర్ మంటల్లో చదువు

కశ్మీర్ మంటల్లో చదువు

Cartoonsమూడు నెలల కంటె తక్కువ కాలంలో కశ్మీర్‌లో స్కూళ్లను తగులబెట్టిన ఘటనలు 28 జరిగాయి. ఈ విధ్వంసానికి ప్రభుత్వం, వేర్పాటు వాదులు ఒకరినొకరు నిందించు కొంటున్నారే తప్ప దాన్ని నివారించడానికి ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు. దక్షిణ కశ్మీర్ గ్రామంలోని బాటాగుండ్ మిడిల్ స్కూలులో ఈ నెల 28రాత్రి జరిగింది. అటువంటి ఘటనల్లో తాజా ది. పరీక్షలు సమీపిస్తున్నాయని మరునాడు ప్రొద్దుటే స్కూలును తెరవాలని చూడగా ఆ క్రితం రాత్రే అది భస్మీపటలమైంది. 2006 నుంచి ఆ స్కూల్ ప్రిన్సి పాల్‌గా ఉన్న అయూబ్ భట్ కళ్లముందే అది మంటల్లో ధ్వంస మైంది. గత నెలనుంచి అనంత నాగ్ జిల్లాలో మాడి బూడిదైన అయిదో పాఠశాల అది. కశ్మీర్‌లో నిరసన జ్వాలలు నాలుగు నెలల క్రితం రేగినపుడు ఆ స్కూల్ రోల్స్‌లో 190 మంది విద్యార్ధులు ఉండేవారు. సమీపంలోని గ్రామాలనుంచి విద్యార్థులకు తలుపులు తెరిచాక వారి సంఖ్య 400కు పెరిగింది. ఈ నెల 30న ఆ విద్యార్థులలో కొందరు తాము చదువుకొన్న స్కూలును దర్శించుకోవడానికి ఆఖరి సారి ఊళ్ల నుంచి వచ్చి విషాద వదనాలతో తిరుగుముఖం పట్టారు. ‘ఇలా చదువుల బడిని కాల్చేస్తే ఎవరికి లాభం’ అని నిట్టూర్చాడో గ్రామస్థుడు.

ఆ స్కూలును ఎవరు తగుల బెట్టారో ఎవరికీ తెలియదు. ఆ ప్రశ్నకు ఎవరి వద్దా జవాబు లేదు. అసలు కశ్మీర్‌లో విద్యా సంస్థల ను ఎవరు, ఎందుకు తగులబెడుతున్నారో ఎవరూ చెప్ప లేరు. బాటా గుండ్ మిడిల్ స్కూల్ కశ్మీర్‌లో గత రెండు నెలల్లో తగులబడిన 28 స్కూళ్లలో ఒకటి. గత జూలై ఎనిమిదిన రెబెల్ కమాండర్ బుర్హాన్ వనీని చంపిన తరువాత నెలకొన్న అశాంతి మూలంగా 115 రోజుల పాటు స్కూళ్లు మూతపడ్డాయి. వాటిని తిరిగి తెరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ సూళ్ల దహనకాండ చోటు చేసుకొంది. సెప్టెంబర్‌లో తొమ్మిది స్కూళ్లను దుండగులు తగుల బెట్టారు. అక్టోబర్‌లో మొత్తం 18 స్కూళ్లు తగులబడ్డాయి. అక్టోబర్ చివరి నాలుగు రోజుల్లో మొత్తం 6 స్కూళ్లు మంటల్లో బూడిదవగా, ఒక్క 30వ తేదీనే 2 స్కూళ్లు తగులబడ్డాయి. బాటాగుండ్ మిడిల్ స్కూల్లో 3 అంతస్థులు ఒకే సారి తగులబడ్డం మనసును కుదిపేసిం దని హెడ్ మాస్టర్ అయూబ్ అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అశాంతికి కేంద్రమైన దక్షిణ కశ్మీర్‌లో 15 స్కూళ్లు ఆహుతయ్యాయి. అక్కడ మొత్తం నాలుగు జిల్లాలకు ఈ దహనకాండ వ్యాపించింది. కశ్మీర్‌లో పాఠశాల విద్య డైరెక్టర్ ఐజాజ్ అహ్మద్ భట్ ఈ దహనకాండపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘స్కూళ్లు మన జాతీయ సంపద. వాటిని దహనం చేయడం విచారకర మేకాక పెద్దగా నష్టం తెచ్చే దుశ్చర్య’ అని ఆయన అన్నారు. నిరంతర నిఘా ప్రతి ఒక్క స్కూలుకు కల్పించలేమని అశక్తత వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క స్కూలుకు నిఘా సిబ్బంది సేవలు పొందాలని జిల్లాల ప్రధాన విద్యాధికారులను విద్యాశాఖ అదేశించినప్పటికీ ఇకముందు నష్టాలు జరగకుండా ఉండాలంటే స్థానిక ప్రజల సహకారం తప్పని సరిఅని భట్ గుర్తు చేశారు.

కశ్మీర్‌లో తీవ్ర అశాంతి నెలకొన్న 2008, 2010లో కూడా అటువంటి ఘటనలు జరగలేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం రెండు నెలలుగా ఈ దహనకాండ రాత్రిపూటే జరుగుతోంది. పట్టుబడ కుండా ఒక పద్ధతి ప్రకారం దుండగులు ఈ దహనకాండ సాగిస్తు న్నారని దీనినిబట్టి అర్థమవుతోంది. తగులబడ్డ స్కూళ్ల సిబ్బందితో సహా కొందరు స్థానికులను పోలీసులు ప్రశ్నించినప్పటికీ ఇంత వరకూ ఎవ్వరినీ అరెస్టు చేయలేదని అనంత నాగ్ జిల్లా విద్యాధికారి గులాం రసూల్ షా చెప్పారు. ఆ భవనాలను తిరిగి నిర్మించడానికి చాలా కాలం పడుతుందికాబట్టి అంతవరకూ విద్యార్థుల చదువు ఆగి పోతుందని షా ఆందోళన చెందుతున్నారు. కశ్మీర్‌లో ఏ జిల్లాలో జరగనంతగా అనంతనాగ్ జిల్లా పక్కనే ఉన్న కుల్గామ్ జిల్లాలో ఏకంగా 7 సూళ్లు దగ్ధం చేశారు. గతవారం బిజెపి నేత యశ్వంత్ సిన్హా సారథ్యంలోని ప్రతినిధి వర్గం హురియత్ నాయకుడు సయ్యద్ అలీషా జిలానీని కలుసుకొని చాలాకాలంగా మూతబడి ఉన్నందున సూళ్లను నిరసన కార్యక్రమాల నుంచి మిన హాయించాలని కోరారు. అయితే ఆ సమా వేశంలో ఏమీ తేలలేదు. ప్రధాన పార్టీలూ, వేర్పా టువాదులూ ఇరుపక్షాలూ స్కూళ్ల దహనకాండను తీవ్రంగా ఖండించి నప్పటికీ బాధ్యతను మాత్రం ఒకరిపై ఒకరు మోపు కొంటూ పరస్పరం విమర్శించుకుంటు న్నారు. జమ్మూలో పోలీసు పతకాల ప్రదానోత్స వంలో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నేరాన్ని వేర్పాటు వాదులపై మోపారు. వారికి చదువు సంధ్యలులేని కొత్తతరం యువత కావాలని నిందించారు. రాళ్లు విసిరే రకం యువతను తుపాకి గుళ్లకు బలి పెట్టడం కోసం వారు కోరుకొంటున్నట్లు విమర్శించారు. యువత చదువుకొన్నదైతే వారి చెప్పుచేతల్లో రాళ్లు విసరరని వ్యంగ్యంగా అన్నారు.

పోలీసుల ‘నిఘా కళ్ల’ సాక్షిగానే స్కూళ్ల దహనకాండ సాగు తున్నట్లు వేర్పాటువాదులు ఆమె విమర్శలను తిప్పికొట్టారు. ‘పోలీ సుల సామీప్యతలో, వారి ఎదుటే స్కూళ్లను తగులబెట్టడం సాగు తోంది’ అని హురియత్ కానరెన్స్ గత ఆదివారం నాడు ప్రకటన విడుదల చేసింది. ఉద్యమాన్ని జనం దృష్టిలో పలచనచేయడంకోసం అటువంటి పనులు సాగిస్తున్నారని, సమాజ శ్రేయస్సు కోరేవారు అటువంటి చర్యలకు ఎంతమాత్రం దిగరని ఆ ప్రకటన పేర్కొంది. ఈ అంశం ప్రచార సాధనాల పతాక శీర్షికలకు ఎక్కడంతో పోలీసులు దర్యాప్తు చర్యలు ప్రారంభించారు. కాని ప్రతిఒక్క స్కూలుకు భద్రత కల్పించలేమని అన్నారు. స్థానిక ప్రజలకు ప్రమేయం కల్పిం చడంలోనే ఈ సమస్య పరి ష్కారం దాగి ఉందని శాంతి భద్రతల పోలీసు డైరెక్టర్ జనర ల్ ఎస్‌పి వాయిద్ అన్నారు. బాధ్య త అంతా ఒక్క పోలీసు శాఖే మోయజాలదని ఆయన చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభు త్వంలో ఏమీ తెలియని అయోమయం కొన సాగుతుండగా, కొన్ని స్కూళ్లకు జరిగిన నష్టం పూరించశక్యంకానిదిగా ఉంది. ఉదాహర ణకు దాడులు జరిగి న స్కూళ్లల్లో వక్ఫ్ బోర్డుకు చెందిన 113 ఏళ్ల క్రిందటి అనంతనాగ్ లాల్ ఛౌక్‌లోని ‘ఇస్లామియా హాన్ఫియా స్కూల్’ సెప్టెంబర్ 19న పూర్తిగా తగులబడింది. ఈ నష్టాలకు కారకులైన దుష్టశక్తిని త్వర లోనే గుర్తించి, కశ్మీర్‌లో విద్యా పుష్పాలను తిరిగి వికసింపజేయాలని అందరూ కోరుతున్నారు.

– ముదసిర్ అహమద్