Home ఆదిలాబాద్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రారంభం

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రారంభం

adదండేపల్లి : దండేపల్లి మండలంలోని లింగాపూర్, గూడెం, దండేపల్లి లతో పాటు పలు గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం మద్యాహ్న భోజనం ప్రారం భించారు. మండుటెండలు అధికమైనందునా వేసవి సెలవులు కావడంతో పలు గ్రామాలలో మద్యాహ్న భోజనంకు విద్యార్థులు గైర్హాజరయ్యారు. దండేపల్లి ఉన్నత పాఠశాలలో మద్యాహ్న భోజనం ఏర్పాటు చేసినప్పటికి విద్యార్థులు ఎవ్వరు రాకా ప్రధా నోపాద్యాయులు, మద్యాహ్న భోజన నిర్వాహకులు విద్యార్థుల కోసం ఎదురు చూశారు. చాలా గ్రామాలలో మద్యాహ్న భోజన పథ కం నామమాత్రంగా సాగింది.
గుడిహత్నూర్‌లో : మండలంలోని కొల్హారి ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం వేసవి మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే బాపురావ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతు రాష్ట్రంలో నెలకొన్న కరువును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నేటినుండి మధ్యాహ్న భోజనాన్ని పెట్టడానికి నిర్ణయించిందన్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులందరికి మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఎంపిపి కుమ్మరి సత్యరాజ్,సర్పంచ్ సోంటక్కే బాలాజీ,విద్యాకమిటీ చైర్మన్ చందాసింగ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబరీష్ కుమార్,తెరాస మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్,తెరాస జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
ఉట్నూర్‌లో : మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం మద్యాహ్న బోజనాన్ని అమలు చేశారు. మండలంలోని గంగన్నపేట గ్రామంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు మద్యాహ్న బోజనం విద్యార్థులకు వడ్డించారు. వేసవి సేలవుల్లో పాఠశాలల్లోని విద్యార్థులు మద్యాహ్న బోజనాన్ని అమలుచేయలని ఆదేశానుసారం మద్యాహ్న బోజనాన్ని మొదలుపెట్టమన్నారు. ఈ పాఠశాలనే కాకుండ మండలంలోని అన్ని పాఠశాలల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులున్నారు.
భీమినిలో : వేసవి సెలవుల్లోకూడా పాఠశాల విద్యార్థులకు మద్యాహ్న భోజనాన్ని అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని పాఠశాలల్లో గురువారం నుండి మద్యాహ్న బోజనాన్ని ప్రారంభించినట్లు. మండల విద్యాధికారి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. పాఠశాలల్లో ప్రధానోపాద్యాయులు అందుబాటులో ఉండి విద్యార్థులకు 11 గంటల లోపు భోజనం అందించాలని ఆటు తరువాత పల్లిలను ఇంటికి పంపించాలని ఆయన సూచించారు.
తాండూర్‌లో : మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి సెలవులలో విద్యార్థులకోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థులు, వారి తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎంఈవో వాసాల ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తంగెల్లపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మద్యాహ్న భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అన్నం వడ్డించే నిర్వాహకులకు పలు సూచనలు చేస్తునే అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. మండలంలో 38 పాఠశాలలు ఉన్నాయని, విద్యార్థుల సంఖ్య మొత్తం 3034 మంది విద్యార్థులు ఉన్నారని, ఈ రోజున 1113 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆయన తెలిపారు.
ఆదిలాబాద్ టౌన్‌లో : ప్రభుత్వం ఆదేశించిన ప్రకారము కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 2016-17 వేసవి సెలవుల్లో జిల్లాలో 1 నుండి 10వ తరగతి వరకు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఈ రోజు నుండి మధ్యాహ్న భోజనం అందించాల్సిందిగా జిల్లా విద్యా శాఖాధికారిని జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ ఆదేశించారు. గురువారం ఉదయం కలెక్టరేట్‌లోని జాయింట్ చాంబర్‌లో విద్య శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మధ్యాహ్న భోజనం ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. తల్లిదండ్రులు అనుమతితో బడికి పంపిన పిల్లలకు ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలన్నారు. ఈ రెండు గంటలపాటు పిల్లలకు విజ్ఞానాన్ని పెంపొందించే అంశాలను చదివించాలన్నారు. జిల్లాలో 3,817 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు కాని టీచర్లు కాని బాధ్యత వహించి పిల్లలకు మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పించే దిశగా ఏర్పాట్లు చేయాలన్నారు. భోజనం అనంతరం పిల్లలు వారి ఇళ్లకు వెళ్లేలా చూడాలన్నారు. డిప్యూటి డిఇఓలు, ఎంఇఓలు, క్లస్టర్ రిసోర్స్‌పర్సన్స్ వారి జూరిస్‌డిక్షన్ పరిధిలో ఉన్న మూడు, నాలుగు పాఠశాలలను ప్రతి రోజు సందర్శించాలన్నారు. ప్రతి రోజు పాఠశాలకు వచ్చి మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థుల వివరాలను, ఉదయం 9 గంటల కల్లా ఎస్‌ఎంఎస్ ద్వారా డిఇఓలకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తెలియపర్చేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రధానోపాధ్యాయులు, టీచర్లు ఎవరైతే మధ్యాహ్న భోజన కార్య క్రమానికి ఇంచార్జిలుగా ఉంటారో వారు దాని సంబంధిత రిపోర్టులు, రిజిస్టర్లు మెయింటేయిన్ చేయాలని, వాటిపై ఎస్‌ఎంసి/కమ్యూనిటి మెంబర్ల సంతకాలు తీసుకోవాలని ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించాలని ఆయన తెలిపారు. డిఇఓ సత్యనారాయణ రెడ్డి, డిప్యూటి డిఇఓ శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్‌టౌన్‌లో : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వేసవి సెలవుల్లో పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తోంది. గురువారం అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. పట్టణంలోని 33 ప్రభుత్వం పాఠశాలల్లో అమలు చేశారు. ఉదయం 8గంటల నుంచి 11.30గంటల వరకు పాఠశాలలో ఆటలపోటీలు నిర్వహించి మధ్యాహ్నభోజన పథకంలో కడుపు నిండా భోజనం పెడుతున్నారు. దీంతో అటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.