Saturday, April 20, 2024

డిజిటల్ పాఠాల దిశగా పాఠశాలలు…

- Advertisement -
- Advertisement -
Schools Towards Digital Classes
ఈనెలాఖరు వరకు సెలవులు పొడిగించిన విద్యాశాఖ
వైరస్ ఉనికితో ఆన్‌లైన్‌లో తరగతులు పెట్టాలంటున్న తల్లిదండ్రులు
ఫిబ్రవరి ముగిసేవరకు ఇంటికి పరిమితం కానున్న చిన్నారులు
బడుల్లో వైరస్ సోకితే కట్టడి చేయడం కష్టమని వైద్యులు వెల్లడి

హైదరాబాద్: నగరంలో ఒమ్రైకాన్ భయంతో విద్యార్ధులకు గతేడాది నిర్వహించిన విధంగా డిజిటల్ పాఠాలు బోధించే దిశగా విద్యాసంస్థలుసిద్దమైతున్నారు. ప్రభుత్వం ఈనెల 31వరకు సెలవులు పొడిగించడంతో చిన్నారులు చదువులో వెనకబడకుండా ఉండేందుకు డిజిటల్ పాఠాలకు ఏర్పాటు చేస్తున్నారు. గత 10 రోజులు వైరస్ వేగంగా విస్తరిస్తూ భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్పూ ఉండటంతో నగరంలో కూడా రెండు, మూడు రోజుల విధించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. అదే విధంగా పాఠశాలలో వైరస్ విజృంభణ చేస్తే కట్టడి చేయడం సాధ్యమని అందుకోసం ముందుస్తు జాగ్రత్త చర్యలో భాగంగా పాఠాలకు సెలువులు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారులు పేర్కొంటున్నారు. సంక్రాంతి పండగకు ముందే విద్యార్ధులను తల్లిదండులు ప్రత్యక్ష తరగతులకు పంపేందుకు వెనకడుగు వేశారు.

కరోనా కేసులు పెరుగుతున్నప్పటి నుంచి తరగతులకు 50శాతం మంది చిన్నారులు హాజరుకావడం లేదు. పండగ తరువాత ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని పలుమార్లు స్కూళ్ల నిర్వహకులకు సూచించారు. మహమ్మారి బడులపై పడితే కష్టమని డిజిటల్ పాఠాలను గురించి ఆలోచన చేయాలని కోరారు. జిల్లాలో 689 ప్రభుత్వ పాఠశాలలుండగా వాటిలో 1.10లక్షల మంది, 1875 ప్రైవేటు స్కూళ్లు ఉండగా 7.20లక్షల మంది చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. నగరంలో కరోనా వైరస్ వ్యాప్తించకుండా చిన్నారులకు సోకకుండా ఉండాలంటే ఆన్‌లైన్ తరగతులే ఉత్తమమని విద్యార్ధి సంఘాలు సూచిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పూర్తి స్దాయిలో అమలు చేయాలంటే సిబ్బంది కాదని, చిన్నారులో ఒకరి లక్షణాలున్న తరగతి మొత్తం వ్యాప్తిస్తుందని వెల్లడిస్తున్నారు. కొందరు ప్రైవేటు విద్యాసంస్దల నిర్వహకులు ఫీజులను పూర్తి స్దాయిలో వసూలు చేసుకుని మూసివేయాలనే ప్రతిపాదనలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కేసులు పెరిగితే పరిస్దితులు చూదామని భావిస్తే అసలుకే ముప్పవస్తుందన వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే మార్చి వరకు విద్యాసంస్దలు ఆన్‌లైన్ పాఠాలు బోధించి, తరువాత వైరస్ తీవ్రత తగ్గితే ఉన్నత పాఠశాల,కళాశాలల విద్యార్దులకు ప్రత్యక్ష పాఠాలు చెప్పాలని అప్పటివరకు మూసివేయడం సరైన నిర్ణయమంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News