Home తాజా వార్తలు సైంటిఫిక్ థ్రిల్లర్

సైంటిఫిక్ థ్రిల్లర్

 Disco Raja

 

మాస్ మహారాజ రవితేజ మరోసారి తన పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్‌తో అభిమానులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ ‘డిస్కో రాజా’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా విడుదల చేసిన సినిమా ఫస్ట్ సింగిల్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. సాహిత్య బ్రహ్మ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో ఎస్‌పి బాలసుబ్రమణ్యం ఈ పాట పాడారు. ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాబీ సింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ః కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్‌ః అబ్బూరి రవి, ఎడిటర్‌ః నవీన్ నూలి, ఆర్ట్‌ః టి.నాగేంద్ర.

Scientific thriller movie Disco Raja