Home జాతీయ వార్తలు అంగారకునిపై కీటకాలు!

అంగారకునిపై కీటకాలు!

Mars
ఒహియో యూనివర్శిటీ పరిశోధకులు ప్రొఫెసర్ ఎమెరిటస్ వెల్లడి

న్యూయార్క్ : అంగారక గ్రహంపై జీవి ఉనికి ఉందా లేదా అని తేల్చలేక శాస్త్రవేత్తలు తర్జనభర్జన పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలోని ఒహియో యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ప్రొఫెసర్ ఎమె రిటస్ విలియమ్ రోమోసెర్ తన పరిశోధనలో కీటకాల వంటి అనేక ఆనవాళ్లను కనుగొన గలిగారు. ఇవి ఇంచుమించు తేనెటీగల్లా కొన్ని, పాకే సరీ సృపాల్లా కొన్ని కనిపించాయి. ఇవి శిలాజాల రూపం లోను, మరి కొన్ని సజీవంగాను పరిశోధనలో బయట పడ్డాయి. అంగారక గ్రహంపై ఇంకా జీవి ఉందని రోమోసెర్ ధ్రువీకరించారు. వీటి చిత్రాలు అంగారక గ్రహంపై జీవరాశి ఉన్నట్టు నిరూపిస్తున్నాయని పేర్కొ న్నారు.

అంగార కుని కీటకాల వంటి ప్రాణుల్లో జీవ వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తోందని, నేలపై కనిపించే కీటకాల లక్షణాలు వీటిలోనూ ఉన్నాయని, పరిణామ క్రమంలో బాగా అభివృద్ధి చెందినట్టుగా వీటికి రెక్కలు ఉండడం, ఆ రెక్కలు వంగే స్వభావం కలిగి ఉండడం, ఎగరడం, వివిధ ఆకృతుల్లో కాళ్లు, ఇవన్నీ అక్కడి ఆన వాళ్లలో స్పష్టంగా ఉన్నాయని వివరించారు. మార్షి యన్ రోవర్, ముఖ్యంగా క్యూరియాసిటీ రోవర్ జీవసంబంధ కార్యకలాపాలు ఏమైనా ఉన్నాయా అ న్న సంకేతాలపై పరిశోధిస్తున్నాయని, ఆమేరకు కీట కాలు, సరీసృపాల వంటి ఆనవాళ్లు చిత్రాల్లో కని పించాయని చెప్పారు. పరిసర ప్రాంతాల నుంచి సేక రించిన అనేక ప్రాణుల కాళ్లు, ఏంటెన్నాలు, రెక్క లు, తదితర అనేక శరీర భాగాలు, చిత్రాల్లో స్పష్టంగా కని పిస్తున్నాయని వీటిని సేకరించే ముందు ఒక కీటకం లోతైన నీటిలో మునిగి ఉండడం బయటప డిందని, చెప్పారు.

కాంతివంత మైన, సంక్లిష్టమైన, తలకిందు లుగా ఉన్న ఇలా వివిధ రకాల ఫొటోగ్రాఫిక్ ప్రమా ణాల మేరకు విడివిడిగా వీటిని అధ్యయనం చేయ డమైందని ఇందులోంచి ఏ ఒక్కదానిని తీసి వేయడం లేదా చేర్చడం అంటూ జరగలేదని పేర్కొన్నారు. వీటి ఆకృతులు, కదలిక, ఎగురుట, అంతర్గత అను సంధానం, ప్రకాశవంతమైన కళ్లు, ఈ లక్షణాలను ఇప్పుడు జీవిస్తున్న వాటితో పోల్చి చూడడమైందని తెలిపారు. ఒక కీటకాన్ని గుర్తించడానికి బాహ్య అస్థి పంజరం, అతికిన భాగాలు, సరిపోతాయని అన్నా రు. కీటకానికి శరీరంలో మూడు భాగాలు, ఒక జత ఏంటెన్నాలు ఆరు కాళ్లు కలిగి ఉండడం సహజ లక్ష ణాలని, అటువంటి లక్షణాలతో భూమిపై కీటకాలు కనిపిస్తుంటాయని, ఇవే లక్షణాలు కీటకాన్ని గుర్తించ డానికి సరిపోతాయని వివరించారు. అంగా రకునిపై ఈ లక్షణాలతో కీట కాన్ని గుర్తించ గలమని చెప్పారు.

ఈ లక్షణాల ప్రాతిపదికగా అంగారక గ్రహంపై కీటకాలు ఉన్నట్టు రోవర్ ఫోటోల ద్వారా గుర్తించ గలుగుతున్నామని ఈ కీటకాలు భూమిపై ఉండే కార్పెంటర్ ఈగలను పోలి ఉన్నాయని చెప్పారు. ఇత ర చిత్రాలను పరిశీలించగా, తేనెటీగలు గుహల్లోని గూడుల్లో ఉన్నట్టు కనిపించా యని, మరికొన్ని చిత్రా ల్లో శిలాజాల ఆకృతులు పాములను పోలి ఉన్నాయని చెప్పారు. అంగారకు నిపై ఎక్కువ సంఖ్యలో మెటజోన్ ప్రాణులు కనిపించ డం బట్టి అక్కడ పోషక విలువలు, శక్తివంతమైన వనరులు, ఆహార వనరులు, జల వనరులు ఉన్నట్టు స్పష్టమవుతోందని, పర్యావరణం కూడా జీవించడా నికి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోందని రోమోసెర్ చెప్పారు.

Scientist claims to spot insects on Mars