Home అంతర్జాతీయ వార్తలు పొగతాగితే మరింత కరోనా తీవ్రత

పొగతాగితే మరింత కరోనా తీవ్రత

Scientists decode smoking worsens covid infection

 

లాస్‌ఏంజెల్స్ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడి

లాస్‌ఏంజెల్స్ : ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన ఊపిరితిత్తుల కండరాలను ఉపయోగించి ఏ విధంగా స్మోకింగ్ కరోనాను తీవ్రతరం చేస్తుందో శాస్త్రవేత్తలు నిరూపించ గలిగారు. ఈమేరకు పొగతాగే వారిలో కరోనా తీవ్రతను తగ్గించడానికి కొత్త వైద్యచికిత్సను కనుగొనడానికి దారి తీస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అమెరికా లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్‌ఏంజెల్స్ (యుసిఎల్‌ఎ)తోపాటు శాస్త్రవేత్తల బృందం పొగతాగే వారిలో కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందని కూడా వెలుగు లోకి తేగలిగారు. మనిషి లోని ఊపిరితిత్తుల కణాలు ఎలా ఉంటాయో అలాంటి కణాలను ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ ప్రకియను ఎయిర్ లిక్విడ్ ఇంటర్‌ఫేస్ కల్చర్ అని అంటారు. ఈ కణాలను సిగరెట్ పొగతో ప్రభావితం అయ్యేలా చేశారు. దీంతో ఆ కణాలు సార్స్ కొవి 2 వ్యాధికి గురికావడం కనిపించింది.

Scientists decode smoking worsens covid infection