Home తాజా వార్తలు కళ్లకు రోబోటిక్ కాంటాక్టు లెన్స్

కళ్లకు రోబోటిక్ కాంటాక్టు లెన్స్

Robotic-Contact-Lenses
కనుపాపల కదలికలతో పనిచేసే కొత్త రోబోటిక్ కాంటాక్టు లెన్సులను శాస్త్రవేత్తలు సృష్టించారు. కళ్లు రెండుసార్లు మిణుకరిస్తే కాంటాక్టు లెన్సు జూమ్ హెచ్చు తగ్గులు అవుతుంటాయి. కేవలం సాల్టు వాటర్‌తో తయారైన ఈ కాంటాక్టు లెన్సు కనుగుడ్డు లోని సహజమైన ఎలెక్ట్రిక్ సంకేతాల మాదిరి గానే అనుకరిస్తుంటాయి. కళ్లు అటు ఇటు తిప్పినా కిందకు మీదకు చూసినా మిణుకరించినా ఎలెక్ట్రికల్ చలన సామర్ధాన్ని పడిగట్ట వచ్చు. కళ్ల కదలికల బట్టి ఎలెక్ట్రో ఆక్యులో గ్రాఫిక్ సంకేతాలను శాస్త్రవేత్తలు కొలవ గలిగారు. కళ్లు మూసినా, పూర్తిగా చీకటిలో ఉన్నా కళ్ల ముందు, వెనుక సామర్థం ఒకేలా నిదానంగా ఉంటుంది. ఈ సంకేతాల ఆధారం గానే యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్‌డిగో పరిశోధకులు కాంటాక్టు లెన్సును అభివృద్ధి చేశారు. వీటిని ఎలెక్ట్రో ఆక్యులో గ్రామ్స్ అని వ్యవహరిస్తున్నారు. ఏదీ చూడకపోయినా చాలా మంది కనుగుడ్లను కదుపుతూనే ఉంటారు. ఎలెక్ట్రో ఆక్యులో గ్రాఫిక్ సంకేతాలు ఉతత్తి అవుతూనే ఉంటాయని శాస్త్రవేత్త డాక్టర్ షెన్‌గ్ గియాంగ్ కై చెప్పారు. ఈ పరిశోధనకు ఆయన మార్గదర్శకత్వం వహించారు. పోలిమర్స్‌తో తయారైన ఈ కాంటాక్టు లెన్సు ఎలెక్ట్రికల్ కరెంటుకు వెడల్పు అవుతాయని చెప్పారు. సైన్స్ విభాగం

Scientists Develop Robotic Contact Lenses That Let Users