Sunday, February 5, 2023

కొత్త ఖండం ‘జీలాండియా’

- Advertisement -

ZEALANDIAన్యూఢిల్లీ : భూమిపై ఇప్పటివరకూ ఎవరూ పట్టించుకోకుండా , ఎవరికి తెలియకుండా అజ్ఞాతంగా ఉన్న మరో ఖండం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకూ ఉన్న ఏడు ఖండాల భూగోళం ఇకపై ఎనిమిది ఖండాంతరం అవుతుంది. ఆస్ట్రేలియా ఖండానికి తూర్పున 50 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఖండాన్ని గుర్తించినట్లు, దీనికి ‘జీలాండియా’ అని పేరు పెట్టినట్లు శాస్త్రజ్ఞులు వెల్లడించారు. ఇంతకాలం అంతరిక్షంలోని గ్రహాలు, గ్రహాంతర వాసుల కోసం సాగుతున్న అన్వేషణల నేపథ్యంలో భౌగోళిక పరిశోధక శాస్త్రజ్ఞులు కనుగొన్న ఈ కొత్త ఖండం ఉనికికి సంబంధించిన తమ అన్వేషణలకు ఇప్పుడు ఉపగ్రహ సమాచారం, అక్కడ దొరికిన రాతి పలకలతో మరింతగా ఆధారాలు లభించాయని వెల్లడైంది. పసిఫిక్ మహాసముద్రం సమీపంలో ఈ కొత్త ఖండం ఉన్నట్లుగా గుర్తించారు. చాలా వరకూ సముద్రంలో మునిగి ఉన్న ఈ కొత్త ఖండం పలు కీలక ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిణామాలకు నాంది పలుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. న్యూజీలాండ్, న్యూ కలేడోనియా మధ్య నెలకొని ఉన్నట్లుగా భావిస్తున్న ఈ సరికొత్త ఖండం ప్రపంచంలోనే అతి తక్కువ విస్తీర్ణపు, సరికొత్త ఖండంగా పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles