Home తాజా వార్తలు అంతరిక్షంలో అరుదైన సూపర్‌నోవా

అంతరిక్షంలో అరుదైన సూపర్‌నోవా

Scientists found a new type of space explosion

 

నైనిటాల్ ఆర్యభట్ట రీసెర్చి ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తల అధ్యయనం

న్యూఢిల్లీ : అతీత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం (అల్ట్రా పవర్‌ఫుల్ మేగ్నెటిక్ ఫీల్డ్) తో ఉండే వేరే విధమైన న్యూట్రాన్ నక్షత్రం నుంచి శక్తిని అరువు తెచ్చుకుని, హైడ్రొజన్ లోపంతో అత్యంత ప్రకాశంతో వేగంగా అభివృద్ధి చెందే సూపర్‌నోవాను భారతీయ పరిశోధకులు కనుగొన్నారు. విశ్వంలో అత్యంత శక్తివంతమైన విస్ఫోటంతో శక్తిని విడుదల చేసే వాటిని సూపర్‌నోవాలు అంటారు. అలాంటి సూపర్‌నోవాలను సూపర్ లూమినస్ సూపర్‌నోవా (ఎస్‌ఎల్‌ఎస్‌ఎన్‌ఇ ) చాలా అరుదుగా సంభవిస్తుంటాయి. ఇటువంటి అత్యంత ప్రాచీన అంతరిక్ష వస్తువులను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా విశ్వం తొలి ఆవిర్భావం నాటి రహస్యాలను ఛేదించవచ్చని డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్‌టి)పరిశోధకులు భావిస్తున్నారు. ఈ సూపర్‌నోవాలు సాధారణంగా అత్యంత ద్రవ్యరాశి కలిగిన నక్షత్రాల నుంచి ఆవిర్భవిస్తుంటాయి.

(సూర్యుని కన్నా కనీసం 25 రెట్లు ద్రవ్యరాశి అధికంగా ఉన్న ద్రవ్యరాశి పరిధిని కనీస ద్రవ్యరాశి అని అంటారు.) అలాంటి భారీ ద్రవ్యరాశి కలిగిన నక్షత్రాలు మన పాలపుంతలో లేదా సమీప పాలపుంతలో అక్కడక్కడ చెల్లాచెదురుగా ఉంటాయి. ఈ నేపధ్యంలో సూపర్‌లూమినస్ సూపర్‌నోవా (ఎస్‌ఎల్‌ఎస్‌ఎన్‌ఇ 1) పరిధులు దాదాపు 150 వరకు ఉన్నట్టు స్పెక్ట్రోస్కోప్ ద్వారా నిర్ధారించ గలిగారు. ఈ ప్రాచీన వస్తువుల్లో చాలా తక్కువగా సూపర్‌నోవా (ఎస్‌ఎన్‌ఇ) ను అర్థం చేసుకోవడమైంది. ఎందుకంటే వాటిలో అంతర్లీనంగా ఉన్న వనరులు ఏమిటో అస్పష్టం కావడం. అయితే వాటి అసాధారణ పతాకస్థాయి ప్రకాశవంతం వివరించలేనిదని పరిశోధకులు పేర్కొన్నారు. 2020 జనవరి 19న జ్వెకీ ట్రాన్‌సియెంట్ ఫెసిలిటీ సూపర్ నోవా 2020 ఎఎన్‌కె(ఎస్‌ఎన్ 2020 ఎఎన్‌కె)ను కనుగొన గలిగింది.

Scientists found a new type of space explosion