Home తాజా వార్తలు సికింద్రాబాద్‌ రిజర్వేషన్ కాంప్లెక్స్‌లోని డేటా కేంద్రాన్ని తనిఖీ

సికింద్రాబాద్‌ రిజర్వేషన్ కాంప్లెక్స్‌లోని డేటా కేంద్రాన్ని తనిఖీ

SCR GM inspects data centre at passenger reservation complex

 

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య

మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య బుధవారం సికింద్రాబాద్‌లోని ప్రయాణికుల రిజర్వేషన్ కాంప్లెక్స్ (పిఆర్‌ఎస్) వద్ద తనిఖీలు నిర్వహించారు. దీంతోపాటు మౌలాలి వద్ద ఏర్పాటు చేయనున్న తాత్కాలికంగా డేటా పనురుద్ధరణ కేంద్రం, ఇండియన్ రైల్వే క్లౌడ్ సెంటర్ పురోగతిపై ఆయన సమీక్షించారు. ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వే సిస్టమ్స్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె.ఆర్.కె రెడ్డి, సికింద్రాబాద్ డివిజన్ డివిజినల్ రైల్వే మేనేజర్ ఎ.కె.గుప్తా, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ శరత్ చంద్రాయన్, ఇతర సీనియర్ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. జనరల్ మేనేజర్ సికింద్రాబాద్‌లోని ప్రయాణికుల రిజర్వేషన్ కాంప్లెక్స్ నుంచి ఈ తనిఖీలు ప్రారంభించారు. పిఆర్‌ఎస్ కాంప్లెక్స్ మొదటి అంతస్తులో ఉన్న ప్రస్తుత డేటా సెంటర్‌ను ఆయన పరిశీలించడంతో పాటు అక్కడ యంత్ర పరికరాల గదిని, డేటా సర్వర్ గది, డేటా పరికరాలను ఆయన తనిఖీ చేశారు.

మౌలాలి వద్ద ఏర్పాటు చేయనున్న తాత్కాలిక డేటాను…
ప్రస్తుతం ప్రయాణికుల రిజర్వేషన్ కాంప్లెక్స్‌లోని డేటా రికవరీ కేంద్రంలో భారతీయ రైల్వే నెట్‌వర్క్ పరిధిలోని అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టం (యూటిఎస్), ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం (పిఆర్‌ఎస్), ఎలక్ట్రానిక్ ప్రొక్యూర్‌మెంట్ సిస్టం (ఈపిఎస్) అప్లికేషన్లకు బ్యాకప్‌ను అందజేస్తున్నారు. మౌలాలి వద్ద ఏర్పాటు చేయనున్న తాత్కాలికంగా డేటా పనురుద్ధరణ కేంద్రం, క్లౌడ్ డేటా సెంటర్ ఆవశ్యకతపై అధికారులు జనరల్ మేనేజర్‌కు వివరించారు. ఇక్కడ భారీ స్థాయిలో డేటా సేకరించి వ్యాపారాభివృద్ధిలో వినియోగిస్తారు. అనంతరం జిఎం మౌలాలి వద్ద ఏర్పాటు చేయనున్న తాత్కాలికంగా డేటా పనురుద్ధరణ కేంద్రం మరియు భారతీయ రైల్వే క్లౌడ్ సెంటర్ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రకృతి వైపరీత్యాలతో, పరికరాల వైఫల్యం పరిస్థితుల్లో ప్రయాణికుల రిజర్వేషన్ టికెటింగ్ సిస్టంకు ఆటంకాలు కలగకుండా సజావుగా సాగేలా చూడడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.

SCR GM inspects data centre at passenger reservation complex