Saturday, April 20, 2024

మన మెట్రో వరల్డ్ క్లాస్

- Advertisement -
- Advertisement -

ప్లాట్‌ఫామ్స్‌కు స్క్రీన్ డోర్స్ మెట్రో రైలు వస్తేనే ఓపెన్
గంటకు 120 కి.మీ. స్పీడ్‌తో పరుగులు
రాయదుర్గం నుంచి నిమిషాల్లోనే ఎయిర్‌పోర్ట్‌కు
27.5 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్..
ఒక కి.మీ. రోడ్ లెవల్‌లో ప్రయాణం మూడేళ్లలో
నిర్మాణం కేంద్రం నుంచి అనుమతి రాగానే
బిహెచ్‌ఇఎల్ నుంచి లక్డీకపూల్ కారిడార్ నిర్మాణం
మెట్రో ఎండి ఎంవిఎస్ రెడ్డి

సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు విజన్‌తో ఉన్నారని, నేడు ప్రారంభించే మెట్రో రెండో దశ నిర్మాణం పలు ప్రత్యేకతలతో నిర్మిస్తున్నట్లు మెట్రో ఎండి ఎన్వీఎస్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం బేగంపేట తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆరు కోచ్‌లతో ప్లాట్‌పామ్ డిజైన్ చేస్తున్నామని, ఎయిర్‌పోర్టుకు రద్దీ సమయంలో 8 నిమిషాలకు, నాన్ పిక్ సమయంలో 20 నిమిషాలకు మెట్రో ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో 2.5 నిమిషాల నుంచి 5 నిమిషాలకు తీసుకొస్తామని తెలిపారు. ఎలివేటర్, మెట్ల మార్గం గుండా వి మానాశ్రయంలో వెళ్లే విధంగా నిర్మాణం చేపడుతామని ట్రైన్ డోర్ ఓపెన్ అయినప్పుడు ప్లాట్‌పామ్ స్క్రీన్ డోర్స్ తెరుచుకునే కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం మెట్రో 35 కెఎంపిహెచ్ స్పీడ్‌తో వెళ్లుతుందని, ఎయిర్‌పోర్టు మెట్రో 120 కెఎంపిహెచ్ స్పీడ్‌తో వెళ్లుతుందని, 31 కిమీ దూరం 26 నిమిషాల్లో చేరుకోవచ్చన్నారు. 27.5 కిమీ ఎలివేటెడ్ కారిడార్‌లో, ఒక కిలోమీటర్ రోడ్ లెవల్ వెళ్లుతుందని చెప్పారు. ఖాజాగూడ నుంచి కుడివైపు తీసుకుని నానక్‌రామ్‌గూడ వెళ్తామని, అక్కడ నుంచి ఎడమ వైపు ఓఆర్‌ఆర్ వెళ్లుతుందని వివరించారు. రాయదుర్గం నుంచి 0.9 కి.మీ. ముందుకు తీసుకుపోతామని, ఎల్ అండ్ టికి ఇచ్చిన భూమి, అరబిందో భవనం వరకు వస్తుందన్నారు. బయోడైవర్సిటీ రెండు ఫ్లై ఓవర్‌పై ఓరియన్ విల్లా, రోడా మేస్త్రీ మధ్య నుంచి మెట్రో వెళ్లు తుందని తెలిపారు. ఎంఎంటిఎస్ రెండో దశను కూడా చేయాలని సిఎం అన్నారని, హయత్‌నగర్ వరకు మెట్రో ఉండాలని మంత్రి కెటిఆర్ చెప్పారన్నారు.

కేంద్రం నుంచి అనుమతి వచ్చిన వెంటనే బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వర కు మెట్రో ప్రారంభిస్తామన్నారు. ఈలోగా రూ. 6250 కోట్ల బడ్జెట్ రా యదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు లైన్ ప్రభుత్వమే మూడేళ్లలో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. మెట్రో రెండో దశ కోసం రెండు డిపిఆర్‌లు పంపినట్లు కేంద్ర నిర్ణయం కోసం ఎదురుచేస్తున్నట్లు తెలిపారు. మెట్రో తొలి ఫేజ్ విజయవంతంగా పూర్తి చే శామని, మెట్రోలో 31కోట్ల 50లక్షల మంది ప్రయాణించారని, 3834 కిమీ ఇప్పటి వరకు మెట్రో తిరిగిందన్నారు. 9.2 కోట్ల లీటర్ల పెట్రోల్, డి జిల్ ఆదా అయిందని వివరించారు. మొదటిదశ స్టేషన్ల విషయంలో తా ము 370కేసులు ఎదుర్కొన్నట్లు, చాలా మంది తమని రకరకాలుగా ఇ బ్బంది పెట్టేందకు ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా తమపై కేసులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News