మనతెలంగాణ/అలంపూర్(మానవపాడు): మానవపాడు కేంద్రంగా సబ్సిడీ గొర్రెల గోల్‌మా ల్ జిల్లా ను కుదిపేసింది. ప్రభుత్వం కురువల అభివృద్దికై చేపట్టిన పధకానికి దళారుల చీడ పట్టిం ది. గొర్రెల కొనుగోలుదారుల నుంచి మధ్యవర్తి త్వం నిర్వహించి అబాసుపాలయ్యారు. మోసపో యిన గొర్రెల కొ నుగోలు దారుల ఫిర్యాదు మేర కు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సబ్సిడీ గొర్రెల మాఫియాను బట్టబయలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వెంకటరాముడు ఉండగా పశువైద్యాధికారి, ఏఎస్‌ఐ వేమన్న, ఇరు వురు విలేకరులు నిందితులుగా ఉన్నారు. వెంక టరాముడును గద్వాల సిసిఎస్ పోలీసులు రాత్రి 11గంటలకు మానవపాడు నుంచి పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించారు. ఎఫ్‌ఐ ఆర్ నమోదు చేశారు. వెంకటరాముడిని అరెస్టు చేసిన పోలీసులు మిగిలిన నిందితుల విషయంలో శీతకన్ను వహించారు. దీంతో నిందితులు పరారీలో ఉన్నారు. యాంటిసిపేటరీ బెయిల్‌కై నిందుతులు ముమ్మరంగా ప్రయత్నాలు సాగుస్తున్నట్లు తెలు స్తోంది. పోలీసులు గొర్రెల గోల నిందుతులపై ఇండి యన్ పీనల్ కోడ్‌లో సెక్షన్ 402,406,9 84లతో పాటు సెక్షన్ 120బి సెక్షన్‌ను జతచే ర్చారు. 120 బి సెక్షన్ మేరకు నిందుతులు నాన్ బెయిల్ కు అడ్డంకిగా మారింది. సెక్షన్ 120 బి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ టెర్రరిస్టుగా ఉంది. ఇది దేశ ద్రోహానికి పాల్పడిన వారితో సమానంగా ఉంది. దీంతో నిందితులు యాంటిసిపేటరీ బెయిల్‌కు సైతం అర్హులు కాకపోవటంతో నిందితులు కోర్టు లోనే, పోలీసుల సమక్షం లోనో లొంగిపోవాల్సి ఉంది. నిందితుల ప్రయత్నాలు ఫలించకపోవ టంతో పోలీసు ఉన్నతాధికారు లతో సంప్రదిస్తు న్నట్లు తెలుస్తోంది. మానవపా డు మండల కేంద్రంలోని అధికార, ప్రతిపక్ష నేతలతో బెయిల్ కోసం సంప్రదింపులు చేస్తున్న ట్లు సమాచారం. కాగా ఎటువంటి పరిస్థితుల్లో నూ నిందితులు లొంగిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో గొర్రెల గోలపై చర్చ జోరుగా సాగు తుండటంతో నిందుతులు లొంగి పోయేందుకు సిద్దం కావటం లేదని సమాచారం.
కొన్ని రోజులు వేచి చూసి సమయాన్ని బట్టి పోలీసులకు లొంగిపోయేందుకు నిందుతులు సిద్దపడినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజు ల్లో నిందితులు లొంగిపోయేందుకు రంగం సిద్ద పడుతున్నట్లు సమా చారం. నిందితులు తమ సమీప బందువుల గ్రామాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు తెలు స్తోంది. ఆ దిశగా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు వి శ్వసనీయ సమాచారం.
గొర్రెల గోలపై ముమ్మర గాలింపు
- Advertisement -
- Advertisement -