Saturday, April 20, 2024

వర్షాలతో భయపెడుతున్న సీజనల్ వ్యాధులు

- Advertisement -
- Advertisement -

దగ్గు, జలుబు, జ్వరాలతో జనం ఆసుపత్రుల బాట
పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవాఖానాల్లో రోగుల రద్దీ
బస్తీ, కాలనీల్లో విజృంభిస్తున్న దోమల దండు
రాత్రివేళ కంటికి కునుకు లేకుండా చేస్తున్న పరిస్థ్దితులు

Seasonal diseases frightening with rains

నగరంలో వాతావరణ మార్పులతో అకాల వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు పంజా విసురుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత ఐదారు రోజుల నుంచి చిరుజల్లు పడుతుండటంతో దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల ను ంచి ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆసుపత్రులతోపాటు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు రోగులతో ర ద్దీగా మారాయి. వర్షాలు ఇంకా కురిస్తే కొత్త రోగాలు పుట్టకొస్తాయని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మన తెలంగాణ/సిటీబ్యూరో: నగర ప్రజలు కరోనా నుంచి కోలుకుని రోజు వారి కార్యక్రమాలు నిర్వహి స్తూ ఆర్థికంగా కుదుట పడుతుండగా సీజనల్ వ్యాధులతో మంచం పడుతున్నారు. ఏమాత్రం జ్వరానికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే సమీపంలోని బస్తీదవాఖానాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉస్మాని యా, గాంధీ ఆసుపత్రులకు రోజుకు 500 నుంచి 800 వరకు, పట్టణ ఆరోగ్య, బస్తీదవాఖానాలకు 120 మంది వరకు వస్తున్నట్లు ఆసుపత్రుల సిబ్బంది వెల్లడిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరిస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో చెత్తా చెదారం ఎక్కడిక్కడే పేరుకుపోవడంతో దోమలు పెరుగుతున్నట్లు, స్థాని మున్సిపల్ అధికారుల ఫాగింగ్ చేయకపోవడంతో రోడ్లపై నీరు నిల్వడంతో రోగాలు పుట్టుకొస్తున్నాయని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ రోగుల సంఖ్య పెరిగితే ఫీ వర్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం తాత్కాలికంగా వైద్య సిబ్బందిని నియమించి రోగులకు సకాలంలో చికిత్సలు అందించేలా చూడాలని వైద్యులు కోరుతున్నారు. ఇదే అదునుగా బావించిన కార్పొరేట్ ఆసుపత్రులు జ్వరంతో రోగులు వస్తే పది రకాల టెస్టులు చేసి డెంగ్యూ, మలేరియా సోకిందంటూ ఆసుపత్రుల్లో చేర్చకుని లక్ష రూపాయలు దండుకునే పనులకు ఒడిగడుతున్నట్లు ప్రైవేటు ఆసుపత్రుల రోగుల బాధితుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందాలని సూచిస్తున్నారు.
దోమల కాటుతో సీజన్ వ్యాధుల ముప్పుతప్పదు : వైద్యాధికారులు
నగరంలో కురుస్తున్న వానలకు రోడ్లపై వ ర్షపు నీరు చేరడంతో పాటు, చెత్త ఉండటంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలను కంటిమీద కునుకు లేకుండా కా టు వేస్తున్నాయి.
జీహెచ్‌ఎంసీ అధికారులు ఫాగింగ్ చే యడంతో పాటు, చెత్తను ఎప్పటికప్పడు తొలగిస్తే ప్రజలకు సోకకుండా కాపాడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News