Saturday, March 2, 2024

‘కాలం’ మారుతోంది!

- Advertisement -
- Advertisement -
global-warming
గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో సీజన్‌లు ఆలస్యం
రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికం,  ఏప్రిల్, మేలో యూవీ సూచీ ‘12’ పాయింట్లు చేరుకునే ప్రమాదం,  తగ్గిన ఓజోన్ పొర మందం, నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్న అతినీలలోహిత కిరణాలు

హైదరాబాద్ : గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వస్తున్నాయని, ఈ నేపథ్యంలో చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం సీజన్‌లు ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు పోతున్నాయో తెలియని పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గత సంవత్సరం చలికాలం సీజన్‌లో రెండే రెండురోజులు (డిసెంబర్ 28, 29 తేదీల్లో మాత్రమే) అధికంగా చలి నమోదయ్యింది. సాధారణంగా నవంబర్ నుంచి జనవరి ఆఖరు వరకు ఉత్తరదిశ నుంచి చలిగాలులు రావాలి. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో దీనికి విరుద్ధంగా బంగాళాఖాతం తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తేమ గాలులు ఎక్కువగా వీస్తున్నాయని, వీటి ప్రభావంతో తరుచుగా ఈ సీజన్‌లో మేఘాలు ఏర్పడుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు.

దీనివల్ల పగటిపూట వాతావరణం వేడెక్కుతోందని, రాత్రిపూట ఈ వేడి భూ ఉపరితలంలోకి వెళ్లిపోయి (ఔట్‌గోయింగ్ రేడియేషన్) చల్లబడిపోవాల్సి ఉండగా, మేఘాలు అడ్డంగా ఉండడంతో ఆ వేడి పూర్తిగా భూమిలోకి వెళ్లడం లేదని వారు పేర్కొంటున్నారు. దీంతో వేడి పరావర్తనం చెంది వెనక్కిరావడంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయని, పగటిపూట ఉష్ణోగ్రతలు సైతం ఎక్కువ రికార్డులో నమోదవుతు న్నాయని, గాలిలో కాలుష్యం పెరగడం కూడా ఇలాంటి పరిస్థితులకు కారణం అవుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

యూవీ సూచీ 7 పాయింట్లుగా నమోదు..

ఈసారి వేసవిలో హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోద య్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తో ంది. దీనికి సూచకంగా మహానగరంలో ఫిబ్రవరి ప్రారంభంలోనే అతినీలలోహిత వికిరణ తీవ్రత (యూవీ ఇండె క్స్) ‘7’పాయింట్లకు చేరుకోవడంతో ఉక్కపోత, చర్మం, కళ్ల మంటలతో నగరవాసులు విలవిల్లాడుతున్నారు. సాధారణంగా ఈనెలలో యూవీ సూచీ 5 పాయింట్లకు మించరాదు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఏప్రిల్, మే నెలల్లో యూవీ సూచీ 12 పాయింట్లు చేరుకునే ప్రమా దం పొంచి ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గ్రేటర్ విస్తీర్ణంలో హరితహారం 8 శాతానికే పరిమితం కావడం, అధికసంఖ్యలో బహుళ అంతస్తుల కాంక్రీటు, గాజు మేడల నుంచి ఉష్ణం వాతావరణంలో తేలికగా కలవకుండా భూఉపరితల వాతావరణానికే పరిమితం కావడంతో ఫిబ్రవరిలోనే వికీరణ తీవ్రత పెరిగిపోయిందని వాతావరణ శాఖ పేర్కొంటుంది.

10 పాయింట్లు నమోదైతే ప్రమాదం..

యూవీ ఇండెక్స్ పెరగటంతో ఓజోన్ పొర మందం తగ్గి భానుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్నాయి. కిరణాలు మనుషులపై పడితే కళ్లు, చర్మ సంబంధ వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. ఎండలో ఎక్కువసేపు తిరిగితే కళ్లు, చర్మం మండటం, రెటీనా దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతాయి. యూవీ సూచీ సాధారణంగా 5 పాయింట్లకు పరిమితమైతే ఎలాంటి ఇబ్బందులుండవు. 10 పాయింట్లు నమోదైతే ప్రమాదం తథ్యమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 12 పాయింట్లు దాటితే చర్మ క్యాన్సర్‌లు పెరిగే ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ్రీన్‌బెల్ట్‌లో హైదరాబాద్‌కు ఏడో స్థానం..

మహానగరాన్ని గ్రీన్‌సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ఉద్యమస్ఫూర్తితో తలపెట్టిన హరితహారం కార్యక్రమం ఉద్దేశం బాగానే ఉన్నా నగరంలో గ్రీన్‌బెల్ట్‌ను గణనీయంగా పెంచేందుకు దోహదం చేయలేదని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. గ్రీన్‌బెల్ట్ విషయంలో దేశంలో పలు మెట్రో నగరాలను చూసుకుంటే హైదరాబాద్ ఏడో స్థానంలో నిలిచింది. హరితహారంలో భాగంగా గతేడాది 95శాతం ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తుల సి, ఉసిరి, క్రోటన్స్, పూల మొక్కలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రధాన రహదారు లు, పార్కులు, ఖాళీ స్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థల్లో రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కల్లో 5 శాతం మాత్రమే నాటారు. పలు నగరాల్లో ఇలా హరితశాతం 1.చండీగఢ్ 35, 2. ఢిల్లీ 20.20, 3. బెంగళూరు19, 4.కోల్‌కతా 15, 5. ముంబై 10, 6. చెన్నై 9.5, 7. హైదరాబాద్ 8 శాతంగా నమోదయ్యింది.

Seasons are delayed by impact of global warming

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News