Home తాజా వార్తలు రూ.62,602 కోట్లు రీఫండ్ చేయాలి

రూ.62,602 కోట్లు రీఫండ్ చేయాలి

Sebi demands Rs 62600 cr from sahara in sc petition

 

సహారా సంస్థలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో సెబీ పిటిషన్

న్యూఢిల్లీ : సహరా సంస్థలకు వ్యతిరేకంగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సహరా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహరా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌లు ప్రజల నుంచి దాదాపు రూ.62,602 కోట్లు వసూలు చేశాయని సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) పేర్కొంది. సెబీసహరా రిఫండ్ ఖాతాలో ఈ డబ్బును రిఫండ్ చేయకపోతే ఈ సంస్థ అధిపతులను అదుపులోకి తీసుకోవాలనుకుంటున్నామని సెబీ పేర్కొంది. రిఫండ్ ఖాతాలో రూ.62 వేల కోట్లు జమ చేసేలా ఈ రెండు సంస్థలను సుప్రీం కోర్టు ఆదేశించాలని సెబీ కోరింది.

2012లో అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల ప్రకారం సహరాకు చెందిన రెండు కంపెనీల నుంచి పూర్తి నగదు రికవరీ కోసం ఈనెల 18న సెబీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలను సహరా కంపెనీలు బేఖాతరు చేశాయని సెబీ తెలిపింది. ఈ కంపెనీ ప్రమోటర్ సుబ్రతా రాయ్ ప్రస్తుత బెయిల్‌పై బయటికి వచ్చారు. బాండ్‌హోల్డర్లకు నగదును తిరిగి చెల్లించడంలో విఫలమైతే రాయ్‌ను తమ కస్టడీకి అప్పగించాలని మార్కెట్ రెగ్యులేటరీ కోరింది.

Sebi demands Rs 62600 cr from Sahara in SC petition