హైదరాబాద్ : సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఎస్ఇసి అప్పీల్ ఇతర ముద్రల ఓట్లపై సింగిల్ జడ్జి ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు అప్పీల్ చేసింది. ఈ అప్పీల్పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. నేరేడ్ మెట్లో ఫలితం నిలిచిపోయిందని ఎస్ఇసి హైకోర్టుకు తెలిపింది. సిబ్బందికి శిక్షణ లోపమే కారణమని అభిప్రాయపడిన హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద సోమవారం విచారణ ఉందని తెలిపింది. అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం సింగిల్ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యాక అభ్యంతరం ఉంటే అప్పీల్ చేయాలని సూచించింది. సోమవారం ఉదయం మొదట ఈ అంశాన్ని విచారించాలని సింగిల్ జడ్జికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.