Saturday, April 20, 2024

నాకు ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించండి: ఎపి ఎన్నికల కమిషనర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు భద్రత కల్పించాలంటూ రమేష్‌కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని ఆయన కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలను వాయిదా వేయడంతో తనపై వ్యక్తిగత దాడి జరిగే అవకాశముందని ఆయన భావిస్తున్నారు. సిఎం నుంచి మంత్రుల వరకు తనను వ్యక్తిగతంగా విమర్శలు చేయడంతో తనకు ప్రాణహాని ఉందని ఆయన కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఒక ఎన్నికల కమిషనర్ తనకు భద్రత కల్పించాలంటూ కేంద్రానికి లేఖ రాయడం ఏపి రాజకీయాల్లో సంచలనం కలిగిస్తోంది. 2014 ఎన్నికల్లో కేవలం కొన్ని మాత్రమే ఏకగ్రీవమయ్యాయని, ఇప్పుడు అనేకచోట్ల ఏకగ్రీవం అయ్యాయని లేఖలో పేర్కొన్నారు. ఏపిలో ఎన్నికలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని, కేంద్ర బలగాలను పంపించాలని ఆయన హోంశాఖకు రాసిన లేఖలో కోరడం విశేషం. దీనిని బట్టి రమేష్‌కుమార్ ఏకగ్రీవం అయిన అన్ని ప్రాంతాల్లో తిరిగి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.

SEC Ramesh kumar wrote letter to Union Govt

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News