Thursday, April 25, 2024

రెండో ప్యాకేజీ రెడీ

- Advertisement -
- Advertisement -
economic-package
ఎప్పుడైనా ప్రకటించే అవకాశం,  ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించిన ప్రధాని

న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కారణంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ పార్ట్ 3 వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. దేశీయ ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలెక్కించడానికి రెండో ఉద్దీపన ప్యాకేజీని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. దీన్ని ఎప్పుడైనా ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇదే విషయమై హోంమంత్రి అమిత్‌షా, ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌లతో పాటు పలువురు అధికారులతో పలు సమావేశాలు జరిపినట్లు సమాచారం. ఈసారి రైతులకు, ఉద్యోగులకు కొంత ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. మొదటి దశలో ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించింది. ఇది మార్చి 25 నుండి ఏప్రిల్ 14 వరకు కొనసాగింది.

దీనిని మే 3 వరకు పొడిగించారు. ఇప్పుడు దానిని మే 17కి పెంచారు. లాక్‌డౌన్ కారణంగా, దుకాణాలు, కర్మాగారాలు, రైలు, విమానాలు సహా అన్ని ఆర్థిక కార్యకలాపాలు మూసివేతకు గురయ్యాయి. పౌర విమానయాన, కార్మిక, విద్యుత్ మంత్రిత్వ శాఖతో సహా పలు మంత్రిత్వ శాఖలతో ప్రధాని ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు. ఆర్థిక వ్యవస్థను త్వరగా ట్రాక్‌లోకి తీసుకురావడానికి దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రధాని ఇప్పటికే వాణిజ్య మంత్రిత్వ శాఖతో వివరంగా చర్చించారు. ఈ సమావేశాలలో హోంమంత్రితో పాటు ఆర్థిక మంత్రి కూడా ఉన్నారు.

రాయిటర్స్ ప్రకారం, ఉద్యోగుల కోసం ఒక పెద్ద ప్రకటన ఉండవచ్చు-. అలాగే రిలీఫ్ ప్యాకేజీ దేశంలోని పేద వర్గాలకు, ఉద్యోగాలు పోయిన ప్రజలకు ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. చిన్న, పెద్ద సంస్థలకు పన్ను మినహాయింపు, ఇతర చర్యల ద్వారా ఉపశమనం ఇవ్వవచ్చు. తొలుత లాక్‌డౌన్ వల్ల ఎక్కువగా ప్రభావితమైన ఆర్థికంగా బలహీన వర్గాలకు రూ .1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది.

second economic stimulus package for India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News