Home కరీంనగర్ కరీంనగర్‌లో రెండవ విడత అభివృద్ధి పనులు

కరీంనగర్‌లో రెండవ విడత అభివృద్ధి పనులు

mayor

*ఫుట్ పాత్ పనుల్లో నాణ్యత పాటించాలి
*నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్

మనతెలంగాణ/కరీంనగర్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీలకు దీటుగా అభివృద్ధిలో మన కరీంనగర్ స్మార్ట్ సిటీ ఉంటుందని నగర మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. మంగళవారం నగరంలోని పలు అభివృద్ధి పనుల తనిఖీలో భాగంగా 49వ డివిజన్ ఆర్టీసీ వ ర్క్ షాప్ వద్ద ఫుట్ పాత్ పనులను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ రెండో విడత అభివృద్ధి పనులు, స్మార్ట్ సిటీ పనులను దృష్టిలో పెట్టుకొని ఫుట్ పాత్ పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులకు ఆదేశాలు చేశారు. ఫుట్ పాత్ నిర్మాణానికి వాడుతున్న మెటీరియల్ నాణ్యతను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. ఎక్కువ కాలం ఉండే విధంగా పను లు చేపట్టాలని, ప్రజలకు మెరుగైన సౌకర్యా లు అందించాలని కోరారు.
నగరంలో కొనసాగుతున్న మొదటి విడత అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేయాల ని కోరారు. రెండో విడత పనులకు టెండర్లు చేసి పనుల వేగవంతంగా పూర్తి చేసుకునేలా చర్యలుచేపడుతున్నామన్నారు.త్వరలోనే స్మా ర్ట్ సిటీ పనులకు కూడా శంకుస్థాపన చేసి ఆ పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి కార్యాచరణ చేస్తున్నామన్నారు. ప్రణాళిక ప్రకారం స్మార్ట్ సిటీ పనులను ప్రారంభిస్తామనన్నారు. కరీంనగర్ నగరాన్ని సుందరంగా మార్చి ప్రజలకు అందిస్తామ నిహామీ ఇచ్చారు.ఫుట్ పాత్ పనులు కొనసాగుతున్న విధానం, నా ణ్యత ప్రమాణాలు, వాడుతున్న మెటీరియల్ తదితర అంశాలను పరిశీలిస్తూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎడ్ల సరిత-అశోక్, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్ పాల్గొన్నారు.