Tuesday, April 23, 2024

రెండవ విడత కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న రెండవ విడత కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు ప్రణాళికబద్దంగా కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు జిల్లా కలెక్టర్లకు సూచించారు. మంగళవారం జగిత్యాల కలెక్టరేట్ నుంచి మంత్రి హరీష్‌రావు వైద్య శాఖ కమిషనర్ శ్వేత, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, హైదరాబాద్ నుంచి వైద్య శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వితో కలిసి జిల్లా కలెక్టర్‌లతో వీడియో సమావేశం నిర్వహించి రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మేడ్చల్ నుంచిపాల్గొన్న జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ… జిల్లాలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు 40 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో బృందంలో వైద్యాధికారి, అప్తోమేట్రిస్ట్, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లు ఉంటారని అన్నారు. జిల్లాలో 5 మంది రెగ్యులర్ అప్తోమెట్రిస్ట్‌లు ఉండగా ఇంకా 35 మంది అప్తోమెట్రిస్ట్‌లకు దరఖాస్తులు ఆహ్వానించామని త్వరలో వారిని నియమాకం చేస్తామని తెలిపారు.
పిహెచ్‌సిలలోని వైద్యాదికారులు, ఆయుష్ వైద్యులు, రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమం వైద్యులు కలిపి మొత్తం 52 మంది వైద్యులున్నారని, అలాగే 270 మంది ఏయన్‌ఎంలు , 560 మంది ఆశాకార్యకర్తలు అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు.

మున్సిపాలిటీలో వార్డుల వారీగా, మండలాలలో గ్రామపంచాయతీ వారీగాఏరోజు, ఎక్కడ శిభిరం ఏర్పాటు చేసి ప్రజలను కంటి పరీక్షలు చేయాలి. బృందాలకు ఎక్కడ వసతి ఏర్పాటు చేయాలో చక్కటి సూక్ష్మ ప్రణాళిక రూపొందించవలసిందిగా సంబందిత అధికారులను ఆదేశించామని అన్నారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా వైద్యాదికారి చందు నాయక్, డిప్యూటీ వైద్యాదికారి విజయనిర్మల, డాక్టర్ నవీన్, ఇంచార్జీ డీపీఓ రాజేంద్రప్రసాద్, మున్సిపల్ కమీషనర్లు జానకీరాంసాగర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News