Home తాజా వార్తలు ‘దర్బార్’ నుంచి సెకండ్ పోస్టర్ విడుదల

‘దర్బార్’ నుంచి సెకండ్ పోస్టర్ విడుదల

Darbarచెన్నయ్ : దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న సినిమా ‘దర్బార్’. ఈ సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా, అనూహ్య స్పందన వచ్చింది. ఈ క్రమంలో బుధవారం ఈ సినిమా నుంచి రెండో లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. కీలక పాత్రలో నివేదా థామస్ నటిస్తున్నారు. సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. తాను నటించిన ‘పేట’ తరువాత రజనీ నటిస్తున్న సినిమా కావడంతో ‘దర్బార్’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ‘దర్బార్’ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి కావొచ్చింది. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Second Poster Release From Darbar