Home స్కోర్ నేటి నుంచే రెండో టెస్ట్

నేటి నుంచే రెండో టెస్ట్

cricketవిశాఖపట్నం: భారత్, ఇంగ్లాండ్ జట్ట మధ్య రెండో టెస్ట్ గురువారం నుంచి వైజాగ్‌లో జరుగనుంది. ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఎసిఎ విడిసిఎ స్టేడియంకు చేరుకుని ప్రాక్టీసు కూడా చేస్తున్నారు. భారత జట్టులో ఒకటి రెండు మార్పులకు అవకాశం ఉంది. హమీద్ ఆట తీరు జాఫ్రీ బాయ్‌కాట్ తీరులో ఉండటం వల్ల అతడిని ‘బేబి బాయ్‌కాట్’ అని కూడా కీర్తిస్తున్నారు. ఓపెనింగ్ స్టాండ్‌లో అతడు మొద టి టెస్టులో కుక్‌తో కలసి 180 పరుగుల భాగస్వామ్యా న్ని నిలిపాడు. ఇంగ్లాండ్ జట్టులో అలస్టెయిర్ కుక్, జో రూట్, మోయిన్ ఆలీ, బెన్ స్టోక్స్ తదితర బ్యాట్స్‌మెన్ లు కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. విఫలమైన బెన్ డకెట్ వైజాగ్‌లో మళ్లీ పుంజుకుని రాణించే అవకాశం కూడా ఉంది. పైగా ఇంగ్లాండ్ బౌలర్లు మోయిన్ ఆలీ, ఆదిల్ రషీద్ తమ స్పిన్ కోచ్ సఖ్లయిన్ ముస్తాఖ్ నేతృ త్వంలో మంచి ఫలితాలు చూయిస్తున్నారు. లెగ్‌స్పిన్నర్ ఆదిల్ రషీద్ అయితే 7 వికెట్లు తీసుకున్నాడు. ట్రెవర్ బేలిస్ ఛార్జీ తీసుకున్నాక ఇంగ్లాండ్ జట్టు చాలా ‘బెస్ట్ పర్‌ఫార్మెన్స్’ చూయిస్తోంది. తమ బ్యాట్స్‌మెన్ భారత్ స్పిన్నర్లకు దీటుగా ఆడుతుండడం వల్ల తమ జట్టు ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని బేలిస్ చెప్పారు.
పిచ్ తటస్థమైనదేనా?
రాజ్‌కోట్ పిచ్‌లో పెరిగిన గడ్డి వల్లే బాల్ తిరగలేదని, భారత్ బౌలర్లు తగిన ఫలితాలు సాధించలేకపోయా రని, ఇంగ్లాండ్ జట్టుపై ఆధిపత్యాన్ని కొనసాగించలే కపోయామని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పటికే అభిప్రాయపడ్డారు. అయితే రాజ్‌కోట్ పిచ్‌ను సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ నిరంజన్ షా సమర్థించా రు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 537 పరుగులు చేసిందిని, భారత్ కూడా సీజన్ మొదలైనప్పటి నుంచి మొదటిసారి ఇన్నింగ్స్‌లో 300 పరుగులు అధిగమిం చిందని నిరంజన్ పేర్కొన్నారు. అక్టోబర్‌లో న్యూజిలాం డ్‌తో భారత్ ఆడినప్పుడు విశాఖ పిచ్ స్పిన్‌కు అనుకూ లంగానే పనిచేసింది. అయితే ఆంధ్ర క్రికెట్ అసోసియే షన్ మాత్రం బహిరంగంగా తమ విశాఖ పిచ్ ‘తటస్థ పిచ్’(న్యూట్రల్ పిచ్) అని పేర్కొంది. ఇదిలా ఉండగా “ విశాఖలో పిచ్ కీలకం. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో పెద్ద స్కోర్లు నమోదవలేదు. పిచ్‌పై పగుళ్లు వస్తే బ్యాటింగ్‌కు కష్టమే”నని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల జరిగిన భారత-న్యూజిలాండ్ చివరి వన్డే చూసిన వారికి గవాస్కర్ అన్నది సబబేననిపిస్తుంది. భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్ట్‌కు ఆతిథ్యమిస్తున్న డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఎసిఎ విడిసిఎ స్టేడియలో నాలుగైదు నెలల క్రితమే కొత్త పిచ్‌ను రూపొందించారు. వాస్తవానికి విశాఖ వికెట్(పిచ్) బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. విశాఖ మైదా నం ఇప్పటి వరకు అంతర్జాతీయ 7 వన్డేలు, రెండు టి20లు నిర్వహించింది. ఈ మైదానంలో ఆడబోయే తొలి టెస్ట్ ఇదే. కాగా భారత్ జట్టు ఆడే 24వ టెస్ట్ మైదానం. కోహ్లి, రూట్ ఇద్దరూ తమ 50 వ టెస్టు ఆడబోయే మైదానం కూడా.
భారత్ జట్టులో మార్పు ఉండొచ్చు
రెండో టెస్టు భారత్ జట్టులో మార్పు ఉండొచ్చు. ఇటీవ ల రాణించని గౌతం గంభీర్‌ను తప్పించి అతని స్థానం లో ఓపెనర్‌గా కె.ఎల్. రాహుల్‌ను మురళీ విజయ్‌తో పాటు ఓపెనర్‌గా దింపే అవకాశాలున్నా యని భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి సూచించారు. రాహుల్ ప్రస్తుతం చాలా వరకు ఫిట్‌గా ఉన్నాడని, కాన్పూర్‌లో జరిగిన గాయం నుంచి పూర్తిగా కోలుకు న్నాడని కోహ్లి అభిప్రాయపడ్డాడు. రెండో టెస్ట్ సంద ర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహు ల్ తమ నెం.1 ఛాయిస్ అని అతడన్నాడు. ఇటీవల రాజస్థాన్‌కు వ్య తి రేకంగా ఆడిన రంజీలో కర్నాటక జట్టు తరఫున రాహుల్ బాగా రాణించాడు. 85 బంతులాడి 76 పరుగులు చేశాడు. అందుకనే గంభీర్ స్థానంలో అతడే ఆటోమేటిక్ ఛాయిస్ అని కూడా విరాట్ స్పష్టం చేశాడు. రాహుల్ లేనప్పుడు గంభీర్ ఆడాడని, కానీ అతడు రెండు టెస్టుల్లో… న్యూజి లాండ్‌తో ఆడినప్పుడు 29, 50 పరుగలకు పరిమితమయ్యాడని, ఇంగ్లాండ్‌తో ఆడినప్పుడు 20, 0 పరుగులే చేశాడని కోహ్లి పేర్కొన్నాడు. కరుణ్ నాయర్, హార్దిక్ పాండ్యలో ఒకరికి, అలాగే ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లో ఒకరికి జట్టులో అవకాశం ఉండనుంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు అవకాశం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
3000 పరుగులకు చేరువలో చెతేశ్వర్, మురళీ
చెతేశ్వర్ పుజారా, మరళీ విజయ్ తమ కెరీర్ 3000 పరుగులకు చేరువలో ఉన్నారు. దీనికి పుజారాకు 3 పరుగులు, విజయ్‌కు 20 పరుగులు చేయాల్సి ఉంది. బహుశా వారు ఈ రికార్డును కూడా విశాఖలో నమోదు చేయొచ్చని తెలుస్తోంది.
ఆండర్సన్ వచ్చే అవకాశం
ఇంగ్లాండు జట్టులోకి జిమ్మీ ఆండర్సన్ వచ్చే అవకాశా లున్నాయి. అతడు అనుభవమున్న, 450 వికెట్లు తీసు కున్న ప్రముఖ ఆటగాడు. అతడు ఇంగ్లాండు జట్టులో ఉంటే ఆ జట్టు మరింత ప్రభావమంతంగా ఆడుతుంది.
క్యాచ్‌లూ కీలకం
రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఫీల్డర్లు ఆరు క్యాచ్‌లు జారవిడిచారు. దాని ప్రభావం చాలా పడింది. ఈ విషయాన్ని అందరూ గమనించారు.
అవసరమైతే డిఆర్‌ఎస్ కోరాలి
చెతేశ్వర్ పుజారా ఎల్‌బిడబ్లు వివాదస్ప నిర్ణయంపై డిఆర్‌ఎస్ కోరనేలేదు. అతడు దాన్ని కోరాల్సి ఉండింది. అలా చేసి ఉంటే 170/1 ఉండేది. అయితే పుజారాని ఇందుకు నిందించలేము. బహుశా క్రీజులో ఉన్న ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు అవసరం లేదనుకుని ఉంటారు.