Home తాజా వార్తలు బడ్జెట్‌లో దీర్ఘకాలిక అంశాలకు ప్రాధాన్యమివ్వాలి

బడ్జెట్‌లో దీర్ఘకాలిక అంశాలకు ప్రాధాన్యమివ్వాలి

Mohan Guruswamy

 

జిడిపి పొదువు నిష్పత్తి 40శాతం సాధిస్తే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యం : మోహన్ గురుస్వామి

మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో దీర్ఘకాలీక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, జిడిపి పొదుపు నిష్పతి 40 శాతం సాధన ద్వారానే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమైతుందని డా. మోహన్ గురుస్వామి అభిప్రాయపడ్డారు. ఫిక్కి, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎమ్‌టి), సుధాకర్ పైవులు మరియు ఫిట్టింగులు, హెచ్‌డిఎఫ్‌సి, ఇవైల ఆధ్వర్యంలో బడ్జెట్ పై జరిగిన విశ్లేషణ సదస్సులో సెంటర్ ఫర్ పాలసీ అల్టర్ నేటివ్స్ చైర్మన్ అండ్ ఫౌండర్, భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ (1988) సలహాదారుగా పని చేసిన డా. మోహన్ గురుస్వామి కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 98 శాతం బడ్జెట్ నిధులు నేరుగా వస్తాయన్నారు. ఇందులో ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి చేసేది ఏమి ఉండదన్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ వ్యయాల కుదింపు, కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీలను మాత్రమే మార్పు చేస్తుందన్నారు.

భారతదేశ జిడిపి కేవలం 6 నుంచి7 శాతం మధ్య ఊగిసలాడుతుందన్నారు. 2024 నాటికి 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేర్చాలంటే 13 నుంచి 14 శాతం జిడిపి ఉండాలని ఆయన గుర్తు చేశారు. ఇది సాధిస్తే, ఉద్యోగాల కల్పన సాధ్యమైతుందన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలపడటానికి పొదుపు నిష్పతి పెరగాలన్నారు. అప్పుడే క్యాపిటల్ వ్యయం నియంత్రణ సాధ్యమైతుందన్నారు. ఈ సమావేశంలో కేంద్ర బడ్జెట్ లక్ష్యాలు-నిధుల ప్రతిపాదనల పై సమగ్రంగా విశ్లేషించారు. ఈ సమావేశంలో ఫిక్కి(తెలంగాణ) చైర్మన్ టి.మురళీధరన్, ఐఎమ్‌టి-హైదరాబాద్ డైరెక్టర్ వెంకటేశ్వర్లుతో పాటు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Secret about budgets is 98% comes straight