Friday, March 29, 2024

సృష్టి రహస్యం

- Advertisement -
- Advertisement -

ఈ భూగోళం మీద చాలా దేశాల్లో చాలా సార్లు ఎన్నో రకాల రోగాలు, జాడ్యాలు, మహమ్మారులు, ఎపిడమిక్స్ వచ్చాయి. మానవాళి ఎప్పటికప్పుడు తుడిచి పెట్టుకుపోతుందని కల్లోల పడ్డారు. కానీ అలా జరగలేదు. ఈసారి అంతే. ఈ మహమ్మారి నుంచీ బైటపడతాం. ధైర్యంగా పరిస్థితులకి ఎదురు నిలవాలి అంతే. ఫ్రంట్ లైన్‌లో పని చేసే కార్యకర్తలని నియంత్రిస్తూ బాధ్యతలు నిర్వర్తించే మీ ఆరోగ్యం నాకు ముఖ్యం. వీలున్నంత వరకూ భౌతిక దూరం పాటించండి. అదే శ్రీరామ రక్ష” అన్నారు చైర్మన్ మీటింగ్ ముగిస్తూ. రామచంద్ర అంతా శ్రద్ధగా విన్నారు. ప్రజాప్రతినిధిగా తన కర్తవ్యం మరోసారి గుర్తు తెచ్చుకున్నారు. ఎంతైనా రోజుకి వందల్లో, వేలల్లో జనం చచ్చిపోతున్నారు. చాలా మందిలాగే ఆయనకీ వర్తమానం అంతా ఆందోళనగా వుంది. అయినా ధైర్యంగా ఉండాలనుకున్నారు.
రామచంద్రకి ఆ రోజు చాలా అలసటగా వుంది. రాత్రి పదకొండైంది. ఇంకో అర గంటలో ఇల్లు చేరిపోవచ్చు. ఎప్పుడు చేరతానా అన్నట్టుంది. బాగా వర్షం పడుతోంది. అకస్మాత్తుగా కారు ఆపాడు డ్రైవరు. రోడ్డు మీదకి చూశారు. రోడ్డు మీద ఓ స్త్రీ కాళ్ళు చాపుకొని కూచునుంది. పొట్ట పట్టుకొని బాధపడుతోంది. గర్భిణీలా వుంది. డ్రైవర్ని వెళ్ళి చూడమన్నారు. చూసి వచ్చాడు. “నిండు గర్భిణీ సార్. నొప్పుల్తో నానా యాతనా పడుతోంది. భర్త ఊళ్ళో లేడట. పేదది. ఒకత్తే హాస్పిటల్‌కి నడుస్తోంది. ఇంక నడవలేని స్థితిలో వుంది. లేవదీయడానికి నా ఒక్కడి వల్లా కాలేదు. ఒళ్ళు వేడిగా వుంది. జ్వరం అనుకుంటా. ఈ వర్షంలో ఇలా వుంటే చచ్చిపోయేలా వుంది” అన్నాడు.
బైట తీవ్ర మహమ్మారి. ఎవరి నుంచేనా, ఏ క్షణంలోనైనా అంటుకోవచ్చు. పైగా గర్భిణీ, జ్వరం, దగ్గరి కెళ్ళటం అతి ప్రమాదం. రాత్రి కర్ఫూ. జన సంచారం లేదు. అంబులెన్స్‌కి ఫోన్ చేసి తన దారిన తను వెళ్ళిపోతే. రామచంద్రకి మనసొప్పలేదు. పరిస్థితి చూస్తుంటే అంత సమయం ఉన్నట్టు లేదు. అతనిలోని మానవత్వం ఊరుకోలేదు. ఒక్కుదుటున కారు దిగాడు. డ్రైవరు, రామచంద్ర ఆమెను మోసుకొచ్చి కారు ఎక్కించారు. హాస్పిటల్ చేరిన పావు గంటలోపే ప్రసవం జరిగింది. పెద్ద ప్రాణం, చిన్న ప్రాణంతో సహా కాపాడిన గొప్ప తృప్తి. ఇప్పుడు వాళ్ళల్లో ఏ జంకూ లేదు. మహమ్మారి వెరపు లేదు. మానవత్వం ముందు భయం ఓడిపోయింది. మానవత్వం, మంచి మనసు ఏ మహమ్మారినైనా జయిస్తుంది. అదే సృష్టి రహస్యం.

రాజారామ్ మోహన రావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News