Home జాతీయ వార్తలు జమ్ముకశ్మీర్‌లో 144 సెక్షన్ అమలు

జమ్ముకశ్మీర్‌లో 144 సెక్షన్ అమలు

section 144

 

జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులు  రోజురోజుకు ఉద్రిక్తం ఎక్కువగా ఉండడంతో రాష్ట్రంలో అర్థరాత్రి తర్వాత పరిణామాలు మారిపోయాయి. పలు జిల్లాల్లో ఆంక్షల అమలుతో పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించి, 144 సెక్షన్ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారు. ఇదిలా ఉండగా.. కిష్టావర్, రాజౌరి, రాంబన్ జిల్లాల్లో అర్థరాత్రి నుంచి కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు మోహరించారు. అనంతరం మాజీ సిఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్భందం చేశారు. దీంతో జమ్ముకశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కశ్మీర్ ఐజీ, గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రత్యేక సమావేశం నిర్వహించి అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.

విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. కశ్మీర్ లోయలో విద్యార్థులు హాస్టళ్లు ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు సూచిస్తూ… తదుపతి ఉత్తర్వులు వచ్చే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లో సమాచార, ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేశారు. దీనిపై ఒమర్ అబ్దుల్లా ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపునివ్వగా, సోమవారం ఏం జరుగుతోందో అని దేవుడేకే తెలియాలని ట్వీల్ చేశారు. కాంగ్రెస్ నేత ఉస్మాన్  మాజిద్‌, సిపిఎం ఎంఎల్ఎ ఎం.వై.తరిగామిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

section 144 imposed in jammu and kashmir