Tuesday, April 16, 2024

ఢిల్లీ షహీన్‌బాగ్‌లో 144 సెక్షన్

- Advertisement -
- Advertisement -

section-144

న్యూఢిల్లీ: ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నిరసనకారులను ఖాళీ చేయించాలని హిందూ సేన పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.  దీంతో వందల సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించి శాంతిభద్రతలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అల్లర్లు జరగకుండా ఢిల్లీ పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. దేశ రాజధానిలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. ఢిల్లీలో తాజా పరిస్థితిలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సిఎం అరవింద్ కేజ్రీవాల్. సాధరణ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అల్లర్లలో ప్రభావితం అయిన ప్రాంతాల్లో ఎస్ డిఎంలు ఇంటింటికి తిరిగి బాధితులను గుర్తించనున్నాయని పేర్కొన్నారు. నష్టపరిహారం కోసం తమకు 69 దరఖాస్తులు అందాయని, వారికి తక్షణమే సాయం అందిస్తామన్నారు కేజ్రీవాల్.

 

Section 144 imposed in Shaheen Bagh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News