Home జాతీయ వార్తలు భద్రతాసిబ్బందిని పరుగులు పెట్టించిన బాలిక

భద్రతాసిబ్బందిని పరుగులు పెట్టించిన బాలిక

FORCEన్యూఢిల్లీ : భద్రతాసిబ్బందిని 12 ఏళ్ల బాలిక పరుగులు పెట్టించింది. నవీ ముంబైలోని ఉరాన్ నౌకాశ్రయం సమీపంలో అనుమానిత వ్యక్తులను చూశానని బాలిక చెప్పడంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు దొరక్కపోవడంతో భద్రతా బలగాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇదంతా బాలిక చేసిన ఆకతాయి పని గుర్తించి, ఆమెను మందలించి వదిలేశారు.