Home జాతీయ వార్తలు కోర్టుల్లో పోలీసులకు బదులు భద్రతాబలగాలు

కోర్టుల్లో పోలీసులకు బదులు భద్రతాబలగాలు

courts

 

కోరుతూ దాఖలైన వ్యాజ్యం, హైకోర్టు తిరస్కరణ

న్యూఢిల్లీ : ఈ నెల మొదట్లో కోర్టు పరిధిలో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో కోర్టుల్లో పోలీసులకు బదులు వేరే భద్రతాబలగాలను నియమించాలని కోరుతూ ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. న్యాయవాదులు, పోలీసుల మధ్య తలెత్తిన ఘర్షణ పరిస్థితి పరిష్కరించ వలసిన అవసరం ఉందని, అంతేకాని ఇటువంటి పిటిషన్ల వల్ల ఎలాంటి సహాయం ఉండదని బెంచ్ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ప్రాతినిధ్య స్టాండింగ్ కౌన్సిల్ అనిల్ సోని అవసరం అనుకుంటే పోలీసులకు అదనపు శిక్షణ ఇప్పించడానికి యోచించాలని వివరించింది. పిటిషనర్లు రేపక్ కన్సాల్, యదునందన్‌బన్సాల్, తమ పిటిషన్లలో నవంబర్ 2 నాటి ఘర్షణను వివరిస్తూ పోలీసులు కాల్పులు జరపడంతో న్యాయవాదులు భయాందోళనలకు గురయ్యారని, తీస్‌హజారీ కోర్టు కాంప్లెక్సులో ఆస్తులు విధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కూడా వారు కోరారు.

Security forces instead of police in courts