Home తాజా వార్తలు బందిపోరాలో ఎదురుకాల్పులు

బందిపోరాలో ఎదురుకాల్పులు

BSf Jawans

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో ఆదివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు హజీన్ ప్రాంతంలోని మీర్ మొహల్లా అనే గ్రామంలో తీవ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలకు తెలిసింది. దీంతో భద్రతా బలగాలు అక్కడ కూంబింగ్ నిర్వహించాయి. ఇది గుర్తించిన ఉగ్రవాదులు.. భద్రతాదళాలపై కాల్పులకు తెగబడ్డారు. దాంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

Security Forces Kill Two Militants in Bandipora.