Home జాతీయ వార్తలు కోర్టుల్లో భద్రతపై మా మార్గదర్శకాలు

కోర్టుల్లో భద్రతపై మా మార్గదర్శకాలు

Security guidelines to be in force till april 18

 

ఏప్రిల్ 18 వరకు అమలవుతాయి : ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని కోర్టుల్లో భద్రతాపరమైన తమ మార్గదర్శకాలు వచ్చే ఏడాది ఏప్రిల్ 18 వరకు అమలులో ఉంటాయని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టుల్లో అవసరమైన పరికరాలు ఏర్పాటు చేసి, తగినంతమంది సిబ్బందిని నియమించాలని ఢిల్లీ హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. కోర్టుల్లో భద్రతా లోపాలపై హైకోర్టు చీఫ్‌జస్టిస్ డిఎన్ పటేల్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 24న రోహిణీ కోర్టులో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు చనిపోవడంతో ఢిల్లీ హైకోర్టు ఈ అంశంలో విచారణ ప్రారంభించింది.

ఆ ఘటన పట్ల సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్ ఎన్‌వి రమణ స్పందించారు. ఢిల్లీ హైకోర్టు చీఫ్‌జస్టిస్‌కు తగిన చర్యలకు ఆదేశాలివ్వాల్సిందిగా సూచించారు. అందుకు పోలీస్ అధికారులు, బార్ అసోసియేషన్‌తో మాట్లాడాలని జస్టిస్ రమణ సూచించారు. మార్గదర్శకాలు జారీ చేయడానికి ముందు ఢిల్లీ పోలీస్ అధికారులు, న్యాయవాదుల సంఘాల నుంచి ధర్మాసనం సూచనలు తీసుకున్నది. ఢిల్లీలో ఏడు జిల్లా కోర్టులున్నాయి. తమ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఢిల్లీ బార్ అసోసియేషన్‌కు హైకోర్టు సూచించింది. ఇప్పుడు అమలవుతున్న భద్రతాచర్యల్లో లోపాలుంటే తదుపరి విచారణలో సవరిస్తామని తెలిపింది. అప్పటివరకూ ప్రస్తుత మార్గదర్శకాలు అమలవుతాయని తెలిపింది.

Security guidelines to be in force till april 18