Home జాతీయ వార్తలు అయోధ్య‌లో భారీ బందోబస్తు

అయోధ్య‌లో భారీ బందోబస్తు

 Security In Ayodhya Ahead Of Ram Temple bhoomi Pujaలక్నో :  అయోధ్య‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయోధ్యలో బుధవారం రామాలయానికి భూమి పూజ జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీరామ‌జ‌న్మ‌భూమి వ‌ద్ద  నాలుగు వేల మంది భ‌ద్ర‌తా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తులో భాగంగా అయోధ్యలో ఎన్ఎస్‌జి క‌మాండోలు మోహరించారు. 75 చెక్ పోస్టుల‌ను ఏర్పాటు చేశారు.  సోమ‌వారం రాత్రి జిల్లా స‌రిహ‌ద్దుల్ని మూసివేశారు. ప్ర‌ధాని నరేంద్ర మోడీ రాక‌కు రెండు గంట‌ల ముందే భద్రతా బలగాలు అయోధ్యను ఆధీనంలోకి తీసుకోనున్నాయి. అయోధ్యలోకి సామాన్యుల రాకపోకలను నిషేథించారు. హ‌నుమాన్‌గ‌ర్హి వ‌ద్ద బ్లాక్ క్యాట్ క‌మాండోలు మోహరించాయి. అయోధ్యకు వచ్చే  ప్ర‌ధాని మోడీ ముందుగా హ‌నుమాన్‌గ‌ర్హి వెళ్లి అక్కడ పూజలు చేస్తారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో మంగళవారం ఉదయం శానిటైజేసన్ చేశారు. జిల్లా మెజిస్ట్రేట్ల‌కు సెక్యూర్టీ విధుల బాధ్య‌త‌ల‌ ను అప్ప‌గించారు.