Home జాతీయ వార్తలు ఆ అయిదుగురు జడ్జీల భద్రత పెంపు

ఆ అయిదుగురు జడ్జీల భద్రత పెంపు

Supreme Court Judges

 

న్యూఢిల్లీ : ఎంతో సున్నితమైన అయోధ్య కేసులో తీర్పు ఇచ్చిన ధర్మాసనంలోని అయిదుగురు సుప్రీంకోర్టు జడ్జీలకు అదనపు బలగాలు, బారికేడ్లు, మొబైల్ ఎస్కార్ట్ బృందాలతో భద్రతను మరింత పటిష్టం చేశారని అధికారులు ఆదివారం చెప్పారు. తీర్పు ఇచ్చిన ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) రంజన్ గొగోయ్, సిజెఐ పదవి స్వీకరించబోతున్న శరద్ అర్వింద్ బోబ్డే, న్యాయమూర్తులు ధనంజయ వై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్. అబ్దుల్ నజీర్ లకు పెంచిన భద్రత శనివారం నుంచి అమలులోకి వచ్చింది. ‘ముందు జాగ్రత్తకోసం వారి భద్రతను పెంచాం.

అయితే, వారిలో ఎవరికీ ఎలాంటి బెదిరింపులూ రాలేదు’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భద్రతా చర్యలో భాగంగా న్యాయమూర్తుల నివాసాల ముందు అదనపు దళాల్ని నియమించారు. వారి నివాసాలకు దారితీసే రోడ్లపై బారికేడ్లను అమర్చారు. ఇంతకు ముందు జడ్జీలకు హౌస్ గార్డులు, సుస్థిర భద్రత ఉండేది. ఇప్పుడు మొబైల్ ఫోన్‌ల కాపలా బృందాలు వెంట ఉంటాయి. ప్రతి జడ్జి వాహనాన్నీ సాయుధ రక్షక భటులున్న వాహనం అనుసరిస్తుంది.. అని మరో అధికారి వివరించారు.

Security Increased For Supreme Court five Judges