Tuesday, February 7, 2023

బాత్రూంలోకి తొంగి చూడటమే ప్రధాని పని : రాహుల్

- Advertisement -

Rahul-Gandhiలక్నో : ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విమర్శలు గుప్పించారు. లక్నోలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం కన్నా ఇతరుల బాత్రూంల్లోకి తొంగి చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని మండిపడ్డారు. ఇతరుల జాతకాలు తెలుసుకోవడం.. గూగుల్‌లో వెతకులాడటం వంటి అంశాలపైనే ఎక్కువ ఆస్తకి చూపిస్తున్నారని అన్నారు. యూపి ఎన్నికల్లో మోడీకి ఎదురుదెబ్బ తప్పదని రాహుల్ పేర్కొన్నారు. నిరుద్యోగం.. దేశ భద్రత, నోట్ల రద్దు వంటి అంశాలపై దేశ ప్రజలకు మోడీ సరైన సమాధానం ఇవ్వలేకపోతున్న మోడీ, ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగుతున్నారున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ ఫలితంగా గత ఏడేళ్లలో ఎన్నడూ లేని విధంగా 90 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles