Friday, March 29, 2024

ఏం నేర్చుకున్నామన్నదే ముఖ్యం

- Advertisement -
- Advertisement -

Seerat Kapoor comments on casting couch

 

కాస్టింగ్ కౌచ్ వివాదం బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌కు కూడా దీని ప్రకంపనలు తాకాయి. చాలా మంది మీటూ ప్రభావం తమపై ఉందని.. తమకు ఎదురైన చేదు సంఘటనలను బయటపెట్టారు. కొంత మంది ప్రతిచోటా కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పుకొచ్చారు. సీరత్ కపూర్ కూడా దీనిపై తాజాగా స్పందించింది. అయితే ఈ అమ్మడు అందరికి భిన్నంగా స్పందించడమే ఆసక్తికరంగా మారింది. “కాస్టింగ్ కౌచ్ ప్రతిచోటా ఉంది. అయితే దాని గురించి ఎలా బయటపడగలం.. దాని గురించి మనం ఏం నేర్చుకున్నాం అన్నదే ముఖ్యం. కాస్టింగ్ కౌచ్ జరిగిందని అరవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని నా ఉద్దేశం. దాని నుంచి ఏదైనా నేర్చుకుంటే మనం మరింత బలపడతాం. అది కెరీర్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఇక కాస్టింగ్ కౌచ్ బారిన ఎలా పడ్డాం? అని కాకుండా ఎలా దాని బారి నుంచి తప్పించుకున్నాం అన్నది చెబితే బాగుంటుంది. దీనిపై ఆరోపణలు చేసినంత మాత్రాన జరిగేది ఏమీ ఉండదు. అల్లరి పాలు కావడం తప్ప” అంటూ తనదైన స్టైల్లో పేర్కొంది సీరత్ కపూర్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News