Home తాజా వార్తలు ప్రారంభమైన ‘సీతామనోహర శ్రీరాఘవ’

ప్రారంభమైన ‘సీతామనోహర శ్రీరాఘవ’

విరాట్ రాజ్ హీరోగా రూపొందుతున్న ‘సీతామనోహర శ్రీరాఘవ‘ చిత్రం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు,ఆత్మీయులు సమక్షంలో వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్ నిచ్చారు. యువ హీరో ఆకాష్ పూరి దర్శకత్వం వహించారు. నిర్మాత సురేష్ బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామల హీరో విరాట్ రాజ్‌కు ఆశీస్సులు అందించి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న దుర్గా శ్రీ వత్సస.కె మాట్లాడుతూ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రమిదన్నారు. చిత్ర నిర్మాత సుధాకర్.టి. మాట్లాడుతూ నవంబర్‌లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. విరాట్ రాజ్, రేవ హీరోహీరోయిన్లుగా నటించే ఈ చిత్రంలో తనికెళ్లభరణి, బ్రహ్మాజీ, పృథ్వీ, కబీర్ దుహాన్ సింగ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తారు.