Home తాజా వార్తలు భద్రాద్రిలో సీతారాముల ఎదుర్కోలు మహోత్సవం

భద్రాద్రిలో సీతారాముల ఎదుర్కోలు మహోత్సవం

మనతెలంగాణ/దుమ్ముగూడెం: భద్రాచల పుణ్య క్షేత్రానికి అనుబంధ ఆలమైన పవిత్ర పర్ణశాల పుణ్యక్షేత్రం రాములోరి కళ్యాణానికి ముస్తాబు అయింది. శ్రీరామనవమి సందర్భంగా లోక కళ్యానార్థం నిర్వహించే కళ్యాణ తంతు భద్రాచలం తరహాలోనే నిర్వహించడం అనావాయితీగా వస్తోంది. నేడు జరిగే కళ్యాణానికి పంచవటి పుణ్య క్షేత్రం అన్ని హంగులతో ముస్తాబు అయింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్త కుండా ఆలయ సిబ్బందితో పాటు పారిశుద్య పనులను పంచాయితీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్నారు.
స్వామి వారి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం నాల్గవ రోజు ఎదుర్కొలు ఉత్సవం అత్యంత కమణీయంగా నిర్వహించారు. నేడు జరిగే శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా ఆలయ అర్చకులు శేషన్ కిరణ్ కుమారా చార్యులు, భార్గవా చార్యులు, కోటి శ్రీమన్నా చార్యులు స్వామి వారిని పల్లకి సేవలో మాఢ వీదుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఎదుర్కోలు ఉత్సవంలో స్వామి వారి గోత్రాలు గొప్పతనం, అమ్మవారి గోత్రాలు గొప్పతనం విపులంగా వివరిస్తూ భక్తి శ్రద్దలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు రామనామస్మరణతో జై శ్రీరామ్, జయ..జయ..శ్రీరామ్ అంటూ భక్తి పార్యవశంతో ఉప్పొంగారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూరిండెంట్ నిరంజన్ కుమార్, ఆలయ ఇన్ చార్జీ బి వాసు, ఆలయ సిబ్బంది కంటెం రాము, రమేష్, ఎగ్గడి శివ, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Seetharamula Edurukolu Utsavam at bhadrachalam