Saturday, April 20, 2024

సీతారాముల కళ్యాణం…పచ్చని పొరక శోభాయాత్ర

- Advertisement -
- Advertisement -

Seetharamula kalyanam

మన తెలంగాణ/ఉట్నూర్ రూరల్:  పట్లణంలోని శ్రీసాయిగురుదత్త మందిరంలో నేడు నిర్వహించనున్న సీతారాముల కాళ్యాణ మహోత్సవానికి భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఎడ్లబండ్ల ద్వారా పచ్చని పొరక శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వినాయక్ చౌక్ లో సిఐ సైదారావు, ఎస్‌ఐ భరత్ సుమన్ ,నాయకులు, భక్తులు పూజలు నిర్వహించి శోభాయాత్ర ను ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రోడ్డు నుండి ఆలయం వరకు శోభాయాత్ర సాగింది. డివిజన్ పరిధిలోని ఇంద్రవెల్లి, నార్నూర్‌తో పాటు కొమురం భీం జిల్లాలోని జైనూర్, ఆసిఫాబాద్ నుండి కూడ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. అలాగే సుమారు 10 వేల మంది భక్తులకు సరిపడ వసతులను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే బండ్ల ద్వారా పచ్చని పొరక తెప్పించి పందిరి వేశారు. ఆలయ ప్రాంగణంలో భారీ టెంట్లు, మంచి నీటి సరఫరా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, భక్తులు కొండేరి రమేష్, భూపతి, గోపాల్ సింగ్, శ్యాంసుందర్, శికారి శ్రీనివాస్, రాజగోపాల్, రంగ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News