Home తాజా వార్తలు గోపీచంద్‌కు పెద్ద హిట్

గోపీచంద్‌కు పెద్ద హిట్

Seetimaarr movie success meet in hyderabad

 

హీరో గోపీచంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్‌లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన భారీ స్పోర్ట్ యాక్షన్ డ్రామా ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా ఇటీవల విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్, సంపత్‌నంది, తమన్నా, శ్రీనివాసా చిట్టూరి, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ “ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. సినిమాలోని ఫైట్స్‌కు మంచి స్పందన వస్తోంది. మణిశర్మ అద్భుతమైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సంపత్ నంది ఈ హిట్‌తో ఆపకుండా ఇంకా పెద్ద హిట్ మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”అని అన్నారు. దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ “వినాయక చవితి రోజున విడుదలైన ‘సీటీమార్’ చిత్రాన్ని ఖైరతాబాద్ వినాయకుడి చేతిలో ఉండే లడ్డంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. గోపీచంద్ ఈ సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు”అని పేర్కొన్నారు.

Seetimaarr movie success meet in hyderabad